Major Movie: హీరోలు షూటింగ్ పేర్లు చెప్పి కారవాన్ లో కూర్చుంటున్నారా?

  • June 13, 2022 / 12:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా అడివి శేష్ నటించిన మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా తను మేనేజర్ సినిమా చూసానని సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. మేజర్ సినిమా పాన్ ఇండియా సినిమాలకు ఏమాత్రం తీసిపోదని ఈ సందర్భంగా తమ్మారెడ్డి మేజర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

మేజర్ సినిమాలో నటీనటుల నటన అద్భుతంగా ఉందని, టెక్నికల్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని, చిత్ర బృందానికి నా అభినందనలు తెలియజేశారు.ఈ విధంగా మేజర్ సినిమా పై ప్రశంసలు కురిపించడమే కాకుండా సినిమాల గురించి కూడా పలు షాకింగ్ కామెంట్ చేశారు.ప్రస్తుతం వివిధ భాషల్లో సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున సినిమా టికెట్ల రేట్లు పెంచాలని ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇలా వందల కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

అయితే మేజర్ సినిమా కూడా వివిధ భాషలలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాకి ఏ మాత్రం తీసిపోదు అయితే ఈ సినిమా కేవలం 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి అంతలోనే పూర్తి చేశారు. మరి మిగతా సినిమాల అన్నిటికీ 100 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందో అంటూ ఆయన పలు భారీ బడ్జెట్ సినిమాల ప్రస్తావన తీసుకువచ్చారు. మేజర్ సినిమాకి కానీ ఖర్చు ఇతర సినిమాలకు ఎందుకు అవుతుంది. హీరోలు నిర్మాతలు ఈ విషయం గురించి ఆలోచించాలి.

ముఖ్యంగా షూటింగ్ సమయంలో సమయం వృధా కాకుండా జాగ్రత్త పడాలి. షూటింగ్ లొకేషన్ లో నటీనటులు షూటింగ్ అని చెప్పి కేరవాన్ లో కూర్చుంటున్నారా? ఒక సినిమాని చేస్తున్నప్పుడు ఎంతో ఫ్యాషన్ తో సినిమా చేయాలి. సమయం వృధా కాకుండా చూసుకున్నపుడే డబ్బు కూడా ఆదా అవుతుందని ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ పాన్ ఇండియా సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus