టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుల్లో ఒకరైన తనికెళ్ళ భరణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే బిజీ యాక్టర్ గా మారారు. చాలా మంది దర్శకులకి ఇష్టమైన నటుడు మన తనికెళ్ళ భరణి అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన 800 కి పైగా సినిమాల్లో నటించారట.
‘మిథునం’ అనే చిత్రానికి ఈయన దర్శకత్వం వహించడం కూడా జరిగింది. ఇక తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పొన్నియన్ సెల్వన్’ కి మాటల రచయితగా కూడా పనిచేశారు తనికెళ్ళ భరణి. ఎన్నో ఏళ్ళుగా సినిమాల్లో ఉన్న ఆయన.. పక్క భాషల్లో కూడా సినిమాలు చేశారు కాబట్టి.. ఆయన అనుభవంలో ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు. ఈ క్రమంలో నార్త్ ఆడియన్స్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘బాలీవుడ్ జనాలకి ఎక్కువ ఫైట్లు ఉంటే సరిపోతుంది ఆ సినిమా నచ్చేస్తుంది. సందర్భానుసారంగా ఫైట్లు రావాలనే పట్టింపు రచయితలకి ఉంటుంది. కానీ అక్కడి వాళ్ళకి అలా ఉండదు. అక్కడి ఫిలిం మేకర్స్ కూడా ఇంకో రెండు ఫైట్స్ తగిలించమని కోరతారు. అలాగే ఏ కంటెంట్లో అయినా ఎక్స్పోజింగ్ కూడా ఉండాలని అక్కడి వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. నేను వాటి నుండి బయటపడి వచ్చినవాడిని’ అంటూ తనికెళ్ళ భరణి (Tanikella Bharani) చెప్పుకొచ్చారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!