అక్కా అంటాడు.. పెళ్లి అంటాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
May 10, 2024 / 08:22 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు తమను అభిమానించే అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలా ముచ్చటించే క్రమంలో కొన్ని సందర్భాల్లో అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు తమకు షాకిచ్చేలా ఉన్నాయని కొన్నిసార్లు అభిమానుల కామెంట్లు ఎంతో బాధ పెడుతున్నాయని హీరోయిన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఒక హీరోయిన్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. నెటిజన్ చేసిన కామెంట్ చూసి ఆ హీరోయిన్ కు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది.
యంగ్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ కు (Tanya Ravichandran) ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ తో ముచ్చటించగా ఒక అభిమాని అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. మొదట ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదని తాన్య తెలిపారు. అక్కా అన్నాడు? పెళ్లి చేసుకుంటావా అన్నాడు? సంబంధం లేకుండా అడిగిన ప్రశ్నకు ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదని ఆమె కామెంట్లు చేశారు.
ఇలాంటి ఫన్నీ సంఘటనలు చూస్తుంటే నవ్వొస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అమ్మాయికి ఎదురైన సంఘటన చూస్తే పుష్ప ది రైజ్ సినిమాలోని ఒక సీన్ గుర్తుకొస్తుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ రసవాది అనే సినిమాలో నటించగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యకు ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉంది.
తాన్య తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాన్యా రవిచంద్రన్ అభినయ ప్రధాన పాత్రలకే ఎక్కువగా ఓటేస్తున్నారని సమాచారం అందుతోంది. తాన్యా రవిచంద్రన్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.