Taraka Ratna: కూతురుతో చివరి సారిగా గేమ్ ఆడిన తారక రత్న.. వీడియో వైరల్..!
March 24, 2023 / 06:11 PM IST
|Follow Us
నందమూరి తారక రత్న మరణించి నెలరోజులు దాటింది.. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా బయటపడ లేకపోతున్నారు.. ముఖ్యంగా ఆయన భార్య, బిడ్డల పరిస్థితి అయితే అందర్నీ కలచి వేస్తోంది.. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.. తమ ప్రేమకు గుర్తుగా బంగారంలాంటి ముగ్గురు పిల్లలనిచ్చి.. తమతో కలిసి ఉండకుండా అనాధలను చేసి వెళ్లిపోయాడంటూ ఆమె పడుతున్న బాధ అయితే వర్ణనాతీతం.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన అభిమానులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు..
తారక రత్న పిల్లలు ముగ్గురు చాలా చిన్న వాళ్లు. భవిష్యత్తులోనే వాళ్లకి తండ్రి ప్రేమ, రక్షణ అనేది ఎక్కువ అవసరం. కానీ విధి మాత్రం ఆ చిన్నారులపై ఏ మాత్రం జాలి, దయచూపకుండా తండ్రిని దూరం చేసి.. ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది.. అయితే ఇంతటి విషాదంలోనూ కాస్త ఊరట కలిగించే విషయం ఏంటంటే.. తారక్ బాబాయ్ బాలకృష్ణ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు.. పెద్ద దిక్కుగా మారి వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఇక తారక రత్న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి బాలయ్యే.. కంటికి రెప్పలా వారిని చూసుకున్నారు. బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చాడు. ముందు నుంచి తారక రత్న- బాలయ్యల మధ్య మంచి అనుబంధం ఉంది.. బాలయ్య తమ కుటుంబ పట్ల చూపిస్తున్న ప్రేమాభిమాలకు ఆయనకు రుణపడి ఉంటామని.. తనకు తండ్రికంటే ఎక్కువని భావోద్వేగానికి గురవుతూ పోస్టులు చేస్తున్నారు అలేఖ్య.. ఇదిలా ఉంటే..
తారక రత్నహిందూపూర్ వెళ్లే ముందు పెద్ద కుమార్తె నిష్కతో గేమ్ ఆడారు.. ‘గేమింగ్.. హిందూపూర్ వెళ్లే ముందు సాయంత్రం ఓబు’ అంటూ ఆ వీడియోను పెద్ద పాప షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.. అది చూసి ఫ్యాన్స్ ఎమెషనల్ అవుతున్నారు.. ‘పిల్లలంటే అన్నకి ఎంతో ప్రేమ.. లవ్ యూ తారక్ అన్న.. మీరెప్పటికీ మా మనసుల్లో ఉంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..