తారకరత్న పెద్దకర్మ… హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు!

  • March 2, 2023 / 11:03 PM IST

నందమూరి తారక రత్న జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా చిన్న వయసులోని తారకరత్న గుండెపోటుకి గురై మరణించడంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక తారకరత్న ఫిబ్రవరి 18న మరణించడంతో నేడు ఆయన పెద్దకర్మ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మార్చి రెండవ తేదీ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై తారకరత్నకు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఇక తారకరత్న పెద్దకర్మ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబునాయుడు దంపతులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి తదితర రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కూడా తారకరత్న పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తో మాట్లాడుతూ ఆమెను ఓదార్చారు. అనంతరం తారకరత్న పెద్ద కుమార్తెతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇక ఎన్టీఆర్ తన అన్నయ్య పెద్దకర్మ కార్యక్రమం కోసమే తన సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసుకున్నారు. అదేవిధంగా ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా అమెరికా పర్యటనని కూడా ఈయనవాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags