ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని అందుకున్న సినిమాలలో జాంబి రెడ్డి ఒకటి. బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జా ఈ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. తేజ సజ్జా నటించిన ఇష్క్ మూవీ ఈ నెల 23వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ సజ్జా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కరోనా ప్రభావం తనపై ఎక్కువగా పడలేదని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తాను బాగానే ఉన్నానని తేజా సజ్జా అన్నారు. ఇష్క్ రిలీజ్ వాయిదా పడటం గురించి స్పందిస్తూ సినిమాను రిలీజ్ చేయడం తేలిక కాదని కానీ తప్పనిసరి పరిస్థితులలో సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని తేజ సజ్జా వెల్లడించారు. జాంబి రెడ్డి సినిమా తర్వాత పది, పదిహేను కథలను విని ఉంటానని తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలే చేస్తానని తేజ సజ్జా అన్నారు.
కొత్త హీరోలకు సినిమా ఆఫర్లు ఎక్కువగా రావని ఆ కారణం వల్లే సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తానని తేజ సజ్జా పేర్కొన్నారు. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులకు హీరోయిజం కావాలని వకీల్ సాబ్ సినిమాను ఫస్ట్ డే సంధ్య థియేటర్ లో చూసిన సమయంలో కోర్టు సీన్లలో పవన్ ను చూసి ఫ్యాన్స్ వెర్రెక్కి పోయారని అలాంటి సినిమాలలో నటిస్తే హీరోలకు కెరీర్ ఎక్కువ కాలం ఉంటుందని చెప్పారు.
దాదాపు ఆరేళ్ల పాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని ఎంతోమంది ప్రామిస్ లు ఇచ్చారని, మరి కొందరు అడ్వాన్స్ గా చెక్కులు ఇచ్చారని కానీ ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయని తేజ సజ్జా తెలిపారు. బాలనటుడిగా మంచి పేరు ఉన్నా తనకు కూడా అవమానాలు తప్పలేదని పరోక్షంగా తేజ సజ్జా తెలిపారు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!