Tejaswi Madivada Love Stories: తేజస్వి మాధివాడ మూడు ప్రేమ కథలు!
March 8, 2022 / 04:32 PM IST
|Follow Us
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న క్యూట్ అమ్మాయి తేజస్వి మదివాడ. ఆ సినిమాలో సమంత సోదరిగా కనిపించిన తేజస్వి పలు సన్నివేశాల్లో మహేష్ బాబు తో కలిసి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అందించింది. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ కెరీర్ మరింత బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఒకటి రెండు మూడు సినిమాలు తప్ప ఇంతవరకు తేజస్వి కి సరైన విజయాలు దక్కలేదు.
ఆమధ్య రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక బోల్డ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఐస్ క్రీమ్ అంటూ రెండుసార్లు అదే తరహా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ హడావుడి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది. పాజిటివ్ బ్యూటిఫుల్ బోల్డ్ పాత్రలు అని తేడా లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చేస్తున్న ఈ బ్యూటీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కూడా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా వెళ్లాల్సి వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 2లో హడావిడి బాగానే చేసినప్పటికీ అక్కడ ఏమాత్రం ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే వెళ్లాలి అని ఆలోచిస్తోంది. ఇక షోలో అవసరమైనప్పుడు తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఇతరులతో షేర్ సీబీసుకుంటోంది. అలాగే ఈ బ్యూటీ తన రిలేషన్షిప్ కూడా చాలా ఓపెన్ గా ఒక వివరణ ఇచ్చింది.
ముఖ్యంగా తన లవ్ బ్రేకప్స్ గురించి కూడా తెలియజేసింది. ఇదివరకే ఇద్దరితో బ్రేకప్ అయినట్లు చెబుతూ ఆ తరువాత కొన్నాళ్లు ప్రేమకు దూరంగానే ఉన్నానని ప్రస్తుతం మరొకరితో రిలేషన్ లో ఉన్నట్లు గా చెప్పింది. అయితే ఇంకా ఆ రిలేషన్ విషయంలో పూర్తిగా క్లారిటీ రాలేదు అని చెప్పిన తేజస్వి తన జీవితంలో కొన్ని పరిణామాలు ఊహించని విధంగా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది.