ఎవరికోసమో మనం మారకూడదు.. అని ఇప్పుడు తెలిసొచ్చింది : తేజస్వీ
September 14, 2020 / 09:24 PM IST
|Follow Us
ఈ లాక్ డౌన్ చాలా మందికి చాలా పాటాలు నేర్పింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను నూతన జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఈ లాక్ డౌన్ చాలా ఉపయోగపడింది. కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.మరికొందరు అయితే కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే రైట్ టైం అని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ తేజస్వీ ఇప్పటి వరకూ తన జీవితంలో చేసిన పొరపాట్ల గురించి తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందట.
ఆమె మాట్లాడుతూ.. ‘మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. నా చిన్నప్పుడే నా తల్లికి దూరమయ్యాను. ఇక మా నాన్నగారు మద్యానికి బానిసైపోయారు. అందుకే నేను నా 18వ ఏటనే బయటకి వచ్చేశాను. అప్పటినుండీ ఒంటరిగా ఉంటున్నాను. అంతేకాదు అప్పటినుండీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వేసుకునే బట్టలు,ఇతరులతో మాట్లాడే విధానం.. మొత్తం కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటూ వచ్చాను. మొదట్లో శరీరం కనిపించకుండా ఉండేందుకు పంజాబీ డ్రెస్సులు వేసుకునేదాన్ని.కానీ అటు తర్వాత మారాల్సి వచ్చింది.
గతంలో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అయితే అతను కొన్ని కొన్ని విషయాల్లో నాతో కలివిడిగా ఉండలేకపోయేవాడు. అందుకోసమని నేను అతని ఇష్టాలకు తగినట్లు మారాను. అయితే ఈ లాక్డౌన్ టైములో ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అది కరెక్ట్ కాదేమో అనిపించింది.సొసైటీలో ఉన్న కట్టుబాట్ల కోసం నేను ఎందుకు ఇంత బాధను అనుభవించాలి అనే ఆలోచన వచ్చింది. వేరేవాళ్ల కోసం నేను ఎందుకు మారాలి? ఇక పై వేరే వారి కోసం మారకూడదని స్పష్టమయ్యింది. నా ఇష్టాలకు, ఆలోచనలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది తేజస్వీ.