రాజమౌళి లాంటి దర్శకుడితో కలిసి పని చేయాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. కానీ ఆ ఛాన్స్ కొందరికే వస్తుంది. అలాంటి అవకాశాన్ని నటి అర్చన వదులుకున్నారట. అలా చేసినందుకు ఇప్పుడు బాధ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తను హీరోయిన్ గా సినిమాలు చేస్తోన్న సమయంలో ‘మగధీర’ సినిమాలో సలోని పాత్ర కోసం రాజమౌళి సంప్రదించారట.
కానీ ఆ సమయంలో తను హీరోయిన్ గా బిజీగా ఉండడం, చిన్న పాత్రలో నటిస్తే తన కెరీర్ ఏమైపోతుందనే భయంతో రాజమౌళి ఆఫర్ రిజెక్ట్ చేసిందట. కానీ ఇప్పుడు బాధ పడుతున్నానని.. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే ఎక్కువ ఆలోచించకుండా చేయాల్సిందని.. కానీ ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయిందని అన్నారు. బహుసా ‘మగధీర’ సినిమా చేసి ఉంటే.. ‘మర్యాద రామన్న’ సినిమాలో ఆఫర్ వచ్చి ఉండేదేమోనని అన్నారు. ఇది ఇలా ఉండగా.. తనకు హీరోయిన్ గా ఓ పెద్ద సినిమా ఆఫర్ వచ్చిందని.. చాలా మంచి డైరెక్టర్ అని కానీ తను ఉన్న పరిస్థితుల్లో ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత తన స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారని.. సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పారు. ఆ సినిమా ఏంటి..? డైరెక్టర్ ఎవరనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు.