తెలుగు టీవీ రంగంలో యాంకర్లకు కొదవలేదు. ప్రేక్షకుల్ని తమ మాటలు, అందచందాలు, స్పాంటేనిటీతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు టీవీలో పది మందికిపైగా యాంకర్లు ఉన్నారు. వివిధ టీవీ షోలు, రియాలిటీ షోలు, లైవ్ షోల్లో వాళ్లు సందడి చేస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా వాళ్ల సందడి భారీగానే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాంకర్ల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను ఓసారి తరచి చూస్తే ఆసక్తికర అంశాలు కనిపించాయి.
తెలుగు టీవీ యాంకర్లలో ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం చూసుకుంటే తొలి రెండు స్థానాలకు గట్టి పోటీ ఉంది. ఎందుకంటే ఒక్కో స్థానంలో ఇద్దరేసి యాంకర్లు ఉన్నారు. అయితే తొలి రెండు స్థానాల మధ్య గ్యాప్ చాలా ఎక్కువే ఉంది. దాదాపు డబుల్ అని చెప్పొచ్చు. తొలి స్థానంలో ఉన్న వారికి 42 లక్షలమంది ఫాలోవర్లు ఉండగా, రెండో స్థానంలో ఉన్నవారికి 21 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన యాంకర్లు ఆ స్థానం కోసం పోటీపడుతున్నారు.
ఈ రోజు ఉదయానికి ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో ఓసారి చూద్దాం.
శ్రీముఖి: 42,27,159
రష్మీ గౌతమ్: 42,68,717
సుమ కణకాల: 21,64,883
దీపికా పిల్లి: 21,34,829
వర్షిణి: 18,41,222
లాస్య: 16,42,046
అనసూయ: 11,96,805
శ్యామల: 10,30,050
విష్ణు ప్రియ: 9,46,419
ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోలు, వీడియోలు, రీల్స్‌తో అదరగొడుతుంటారు ఈ నారీమణులు. వీరందరిలో డిఫరెంట్ ఎవరు అంటే దీపికా పిల్లి అనే చెప్పాలి. మిగిలినవాళ్లంతా స్ట్రయిట్ యాంకర్లు కాగా, దీపిక మాత్రం తొలుత నుండే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. టిక్‌టాక్, ఇన్‌స్టా రీల్స్‌తో ఆమె గతంలో చాలా హుషారుగా ఉండేది. ఆందుకే ఆమె యాంకర్ అవ్వకుముందే అంతమంది ఫాలోవర్లు ఉన్నారు. యాంకర్ అయ్యాక ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా పెద్ద పెద్ద యాంకర్లను దాటి ముందుకెళ్లింది.