Gowtham Raju: ‘జానకి రాముడు’ టు ‘రేసుగుర్రం’.. ఎడిటర్ గౌతంరాజు కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే..!
July 6, 2022 / 03:06 PM IST
|Follow Us
టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ అలాగే స్టార్ ఎడిటర్ అయిన గౌతంరాజు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. 68 ఏళ్ల వయసు కలిగిన గౌతంరాజు… కొన్నాళ్లుగా కిడ్నీ మరియు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే నిన్న రాత్రి పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.ఈయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తంగా కలుపుకుని 800 కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు.
సాధారణంగా ఎడిటర్ కు ప్రేక్షకుల్లో పెద్ద గుర్తింపు ఉండదు.మనం సినిమా చూస్తున్నప్పుడు లెంగ్త్ ఎక్కువైనా, తక్కువైనా పరోక్షంగా తిట్టుకునేది వీళ్ళనే..! ఏ పెద్ద సినిమాకి సంబంధించిన లీకులు బయటకు వచ్చినా వీళ్ళనే మనం పరోక్షంగా తిట్టుకుంటూ ఉంటాం. అయితే ఓ సినిమా ఫలితం ఎక్కువ శాతం ఆధారపడి ఉండేది ఎడిటర్ పైనే..! ఎడిటర్ ను దర్శక నిర్మాతలు ఎంత బాగా వాడుకుంటే.. ఔట్పుట్ అంత బాగా వస్తుంది. అయితే గౌతంరాజు ఎడిటర్ గా చాలా అన్ని సినిమాలకు దాదాపు మంచి ఔట్పుట్ ఇచ్చారు అనే చెప్పాలి. కొన్ని జెనరేషన్స్ గడిచినా.. మరిచిపోలేని సినిమాలు గౌతంరాజు అందించారు. మరి ఆయన కెరీర్ లో ది బెస్ట్ అనిపించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) జానకి రాముడు :
1988 వ సంవత్సరం లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, విజయశాంతి జంటగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. పునర్జన్మల కాన్సెప్ట్ తో రూపొందిన ఇలాంటి చిత్రానికి ఎడిటర్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దానిని సమర్ధవంతంగా నిర్వర్తించారు గౌతంరాజు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2) దళపతి :
రజినీకాంత్- మమ్ముట్టి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఇదొక కల్ట్ క్లాసిక్ మూవీ. దీనికి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు.1991వ సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2) కర్తవ్యం :
విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎ.మోహన గాంధీ దర్శకుడు. 1990 వ సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. దీనికి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
4) అసెంబ్లీ రౌడీ :
1991 వ సంవత్సరం లో బి. గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు, దివ్యభారతి జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దీనికి కూడా ఎడిటర్ గా గౌతంరాజు పనిచేశారు .
5) పెద్దరికం :
జగపతి బాబుకి మొదటి కమర్షియల్ హిట్ ను అందించిన మూవీ ఇది.1992 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీకి ఎ.ఎం.రత్నం దర్శకుడు. దీనికి కూడా గౌతంరాజు ఎడిటర్.
6) వారసుడు :
ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. 1993 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
7)పెదరాయుడు :
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995వ సంవత్సరంలో విడుదలైన ఈ మూవీ కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఇది ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే.
8) సూర్య వంశం :
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో వచ్చిన ఈ మూవీకి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
9) సుస్వాగతం :
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో వచ్చిన ఈ మూవీకి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడేలా చేసింది.
10) ఠాగూర్ :
2003 వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీకి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు.
11) యజ్ఞం :
గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 2004వ సంవత్సరంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఈ మూవీ కూడా ఆయన బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా చెప్పొచ్చు అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
12) అతనొక్కడే :
కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. 2005 లో వచ్చిన ఈ మూవీకి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు. ఇది కూడా ఆయన కెరీర్ లో బెస్ట్ వర్క్ గా చెప్పుకోవచ్చు.
13) కిక్ :
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీకి కూడా గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు.
14) గబ్బర్ సింగ్ :
పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం 2012 లో రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతంరాజు ఎడిటర్ గా పనిచేశారు.
15) రేసుగుర్రం :
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2014 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కూడా గౌతంరాజు సినిమాటోగ్రఫీ అందించారు.