అనేక విషయాల్లో హిందీ చిత్రాలను బీట్ చేస్తున్న తెలుగు సినిమాలు

  • August 21, 2017 / 12:53 PM IST

భారతీయ చలన చిత్ర పరిశ్రమల్లో బాలీవుడ్ నంబర్ వన్ ఇండస్ట్రీగా పేరుగాంచింది. ఇక్కడ భారీ బడ్జెట్ తో చిత్రాలు నిర్మితమయ్యేది.. అత్యధిక కలక్షన్స్ వసూలు చేసేది. ఆ రికార్డులను ఏ చిత్ర పరిశ్రమ బీట్ చేయలేకపోయేవి. అయితే బాహుబలి దెబ్బకి లెక్కలన్నీ మారిపోయాయి. మన సినిమా బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ కలక్ట్ చేయగలుగుతుందని బాహుబలి కంక్లూజన్ నిరూపించింది. దీంతో మన దర్శక నిర్మాతలకు బాహుబలి రేంజ్ లో, బాలీవుడ్ చిత్రాలకు మించేలా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్, మార్కెట్ పరంగాను టాలీవుడ్ స్థాయిని పెంచుతున్నారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

స్పైడర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. అంతేకాదు మరో రెండు భాషల్లో డబ్బింగ్ కూడా జరుపుకుంటోంది. హిందీ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేసి కలక్షన్స్ పరంగా రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది.

సాహో బాహుబలితో బాలీవుడ్ లో పాగా వేసిన ప్రభాస్ అదే ఊపుతో పాతుకు పోవాలని చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో రూపుదిద్దుకుంటోంది. బడ్జెట్ కూడా 200 కోట్లు మించి పోతుందని సమాచారం. ఈ చిత్ర బృందంలో బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

నేనే రాజు నేనే మంత్రి దగ్గుబాటి రానా కి బాహుబలితో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో కలక్షన్స్ పై దృట్టి పెట్టారు. అందుకే నేనే రాజు నేనే మంత్రి సినిమాని తెలుగు తమిళ భాషలో తెరకెక్కించారు. ముందుగా తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోను భారీ కలక్షన్స్ రాబట్టింది. త్వరలోనే తమిళనాడులో రిలీజ్ చేయనున్నారు. అక్కడ కూడా కలక్షన్ల వర్షం కురవనుంది.

చిరు 151 మూవీమెగాస్టార్ చిరంజీవి బాహుబలి రికార్డులను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో 151 సినిమాకు సిద్ధమవుతున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్, కోలీవుడ్ సూపర్ హీరో విజయ్ సేతు పతిలు కీలక రోల్స్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని అనేక భాషల వారు ఆదరించేలా కామన్ టైటిల్ ఆలోచిస్తున్నారు.

బాలయ్య 152 సినిమాపైసా వసూల్ సినిమా తర్వాత బాలకృష్ణ తమిళ డైరక్టర్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 152 వ చిత్రాన్ని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమాని ఎక్కువ భాగం తమిళనాడు లోని కుంభకోణంలో చిత్రీకరించనున్నారు. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో బాలయ్య కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నాపేరు సూర్య మూవీ చేస్తున్నారు. దీని తర్వాత భారీగానే ప్లాన్ వేశారు. తమిళ డైరక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో త్రి భాష చిత్రం చేయనున్నారు. ఈ మూవీతో 500 కోట్ల క్లబ్ లో చేరాలని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus