ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సినీ రచయిత కన్నుమూత!

  • January 16, 2023 / 10:05 AM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని పాపులర్ రచయితలలో ఒకరైన బాలమురుగన్ అనారోగ్య సమస్యలతో మృతి చెందగా ఈ విషయం తెలిసిన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత నెల చివరి వారంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. బాల మురుగన్ వయస్సు 86 సంవత్సరాలు కాగా నిన్న ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం.

తమిళంతో పాటు తెలుగులో కూడా పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు బాల మురుగన్ కథ అందించారు. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఎన్నో సినిమాల సక్సెస్ లో బాల మురుగన్ కీలక పాత్ర పోషించారు. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన తొలి సినిమా బంట్రోతు భార్యకు కథ అందించింది బాల మురుగన్ కావడం గమనార్హం. శోభన్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన సోగ్గాడు సినిమాకు కూడా బాల మురుగన్ కథ అందించారు.

ఆలుమగలు, ధర్మదాత, జీవన తరంగాలు, సావాసగాళ్లు మరికొన్ని సినిమాలకు కథలు అందించి ఈ రచయిత తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ఒక వెలుగు వెలిగారు. బాల మురుగన్ కొడుకు, ప్రముఖ సినీ రచయిత భూపతి రాజా బాల మురుగన్ మరణ వార్తను మీడియాకు తెలియజేశారు. బాల మురుగన్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

శివాజీ గణేషన్ హీరోగా తెరకెక్కిన మెజారిటీ సినిమాలకు బాల మురుగన్ కథ అందించారు. బాల మురుగన్ మృతితో భూపతి రాజా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వయస్సు సంబంధిత సమస్యల వల్లే బాల మురుగన్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎనో బ్లాక్ బస్టర్ సినిమాల సక్సెస్ విషయంలో బాల మురుగన్ కీలక పాత్ర పోషించారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus