స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాయి. ప్రభాస్ ఖాతాలో ప్రస్తుతం ఏకంగా 10 సినిమాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
రాబోయే 12 నెలల్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, కన్నప్ప, రాజాసాబ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో పాటు సలార్2, స్పిరిట్, కల్కి సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. జక్కన్న, బోయపాటి శ్రీను, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కూడా ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ డైరెక్టర్ల జాబితాలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాస్ కు ఈ స్థాయిలో క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో భారీస్థాయిలో లాభాలు వస్తున్నాయి.
ప్రభాస్ తో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్స్ రావడం గ్యారంటీ అని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ బిజీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉన్నా ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఇతర భాషలపై కూడా ప్రభాస్ దృష్టి పెట్టి మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ డేట్స్ మాత్రం దర్శకనిర్మాతలకు సులువుగా దొరకవని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.