Thalapathy Vijay: కోర్టుకెక్కిన విజయ్.. కారణమేంటంటే..?

  • September 20, 2021 / 12:16 PM IST

అనుమతి లేకుండా తన పేరుని వాడుతున్నారంటూ తల్లితండ్రులతో సహా మరో పదకొండు మందిపై కేసు పెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. పూర్తి వివరాల్లోకి వెళితే.. గతేడాది నవంబర్ లో విజయ్ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్ మక్కల్ ఇయక్కంను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించినట్లు విజయ్ తండ్రి ప్రకటించాడు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్ గతంలోనే ప్రకటించారు.

అంతేకాకుండా విజయ్ మక్కల్ ఇయక్కం పేరుని గానీ.. ఆ పార్టీ పతాకాన్ని, తన ఫోటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. అయినప్పటికీ విజయ్ తల్లిదండ్రులు తన పేరుని వాడుతూనే ఉన్నారు. తాజాగా విజయ్ ఫ్యాన్స్ కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనడానికి.. ఆయన తల్లితండ్రులు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కొందరు తమ్మెలు విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు.

సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరుని పొలిటికల్ మీటింగ్స్ కి వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్ కోర్టుని ఆశ్రయించారు. తన తల్లితండ్రులతో సహా మొత్తం 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus