‘అల వైకుంఠపురములో’ దెబ్బకి తమన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు..!

  • January 10, 2020 / 05:10 PM IST

మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాడు. గతంలో ఈయన పాటలని ట్రోల్ చేయని నెటిజెన్ లేడు. రొటీన్ ట్యూన్లు, డప్పులు కొట్టేస్తాడని.. అంతేకాదు అతనివన్నీ కాపీ ట్యూన్లని.. కామెంట్లు చేసే వారు. అతని కంటే దేవి శ్రీ ప్రసాద్ ముందుండేవాడు. సాయి తేజ్ లాంటి క్రేజీ హీరోలు కూడా తమన్ సేమ్ టైన్లు కొట్టేస్తాడని.. కవర్ చేస్తూనే సెటైర్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అతని దశ తిరిగింది. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా దగ్గర్నుండీ తమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ ఆల్బం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెల రోజుల నుండీ తమన్ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే ఆయన సంగీతంలో వచ్చిన ‘వెంకీమామ’ ‘ప్రతీరోజూ పండగే’ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇక ‘అల వైకుంఠపురములో’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమన్ కు బాలీవుడ్ నుండీ రెండు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ‘సింబా’ ‘గోల్ మాల్4’ వంటి చిత్రాలకి తమన్ వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి ఫుల్ ఆల్బమ్స్ తో ఇంకెన్ని అద్బుతాలు చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు తమన్ టైం చాలా బాగుందనే చెప్పాలి.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus