Thaman: థమన్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పడానికి అసలు రీజన్ ఇదేనా?
January 29, 2023 / 12:08 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వీరసింహారెడ్డి మూవీకి అద్భుతమైన మ్యూజిక్, బీజీఎం ఇచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీకి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం బాలయ్య హీరోగా తెరకెక్కిన డిక్టేటర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన థమన్ ప్రస్తుతం బాలయ్య సినిమాలకు వరుసగా అవకాశాలను అందుకుంటూ ఇతర మ్యూజిక్ డైరెక్టర్లకు షాకిస్తున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్న థమన్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ కాంబో మూవీకి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న థమన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలకు సంబంధించిన పాటల కంపోజింగ్ సెట్లోనే జరుగుతుందని అన్నారు. హీరో ఆటిట్యూడ్ కు అనుగుణంగా మ్యూజిక్ ను కంపోజింగ్ చేయడం జరుగుతుందని ఆయన కామెంట్లు చేశారు.
నేను క్రికెట్ ఆడతానని థమన్ చెప్పుకొచ్చారు. క్రికెట్ లో నా హైయెస్ట్ స్కోర్ 173 అని థమన్ తెలిపారు. నా ఫేవరెట్ క్రికెటర్ ధోని అని ఆయన కామెంట్లు చేశారు. బాయ్స్ సినిమాలో నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని థమన్ తెలిపారు. బాయ్స్ సినిమా తర్వాత నేను నటించలేదని ఆయన పేర్కొన్నారు. యాక్టింగ్ పై తనకు ఆసక్తి లేదని థమన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.
శంకర్ గారు వైశాలి సినిమాకు ఛాన్స్ ఇచ్చారని థమన్ పేర్కొన్నారు. థమన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. థమన్ కు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా స్టార్ హీరోల సినిమాలకు పని చేసే అవకాశం వస్తుండగా ఆ ఆఫర్ల విషయంలో థమన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. థమన్ ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.