Thandel: నాగచైతన్య సినిమా… చందూ మొండేటి మళ్లీ ఆలోచించుకోవాలా?
January 27, 2024 / 08:51 PM IST
|Follow Us
మామూలు సినిమాల్లో విలన్లు అంటే చాలా రకాలుగా ఉంటారు. అదే దేశభక్తి సినిమాలు అంటే కచ్చితంగా ఆ విలన్ పాకిస్థానే అవుతుంది. మన దేశానికి ఇంకా ఏ దేశంతో వైరం లేదు, మన దేశానికి ఏ ఇతర దేశంతో కష్టం లేదు అనుకునేట్టు చూపిస్తుంటారు. అయితే ఈ కాన్సెప్ట్ మన దగ్గర చాలా తక్కువ. ఎక్కువగా బాలీవుడ్లోనే ఇలాంటి సినిమాలు చేస్తుంటారు. రీసెంట్గా ఇదే కాన్సెప్ట్‌తో ‘ఫైటర్’ అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఫలితంతో ఓ తెలుగు పాన్ ఇండియా సినిమా మీద అందరి లుక్ పడుతోంది.
నాగచైతన్య – సాయిపల్లవి – చందు మొండేటి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘తండేల్’ పేరుతో ఆ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పాకిస్థాన్‌పై ఓ గంగపుత్రుడు చేసిన పోరాటంగా ఈ సినిమా తెరకెక్కుతోంది అని వీడియోతో చెప్పేశారు. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడంటే… ‘ఫైటర్’ సినిమాకు వచ్చిన రెస్పాన్సే. పాకిస్థాన్‌ను బూచిగా చూపించడం అన్నిసార్లు వర్కౌట్ కాదా అనే ప్రశ్న వస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘తండేల్’ సినిమా మీద సుమారు రూ. వంద కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కూడా యాంటీ పాకిస్థాన్ సెంటిమెంట్ చూపిస్తే ఓకేనా అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ అదే అంశంతో సినిమా తెస్తే పాన్ ఇండియా లెవల్లో అంత మంచి రిసెప్షన్ ఉండదు అంటున్నారు.
అయితే ‘తండేల్’ (Thandel) సినిమాలో కేవలం యాంటీ పాకిస్థాన్ కథాంశమే కాకుండా… చాలా ఎమోషన్లు, ప్రేమకథ కూడా ఉన్నాయి అంటున్నారు. ‘తండేల్’ సినిమా నేపథ్యం గురించి తెలిసినవాళ్లు మాత్రం ఈ సినిమాలో చూపించే విషయాలు కేవలం పాకిస్థాన్ చుట్టూ తిరగవు అని చెబుతున్నారు. అయితే మరీ ఆ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దు అని మాత్రం నెటిజన్లు సూచిస్తున్నారు.