అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ తర్వాత వచ్చిన మూవీ ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ భామలు నటించిన ఈ మూవీ జూలై 22న విడుదలయ్యింది.కానీ మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ దారుణంగా నమోదయ్యాయి. నాగ చైతన్య కెరీర్ లో ఇవి డిజాస్టరస్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.
బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎదురీదుతోంది. డిజాస్టర్ రిజల్ట్ నుండి తప్పించుకునే అవకాశాలు అయితే లేవు కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎదురీదుతూనే ఉంది. ఒకసారి ‘థాంక్యూ’ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.30 cr |
సీడెడ్ | 0.42 cr |
ఉత్తరాంధ్ర | 0.56 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.22 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.26 cr |
ఓవర్సీస్ | 0.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.46 cr |
‘థాంక్యూ’ మూవీ రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. క్లీన్ హిట్ అనిపించుకోవడానికి అంత మొత్తం రాబట్టాలి. కానీ 6 రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ.4.46 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ మధ్య కాలంలో నాగ చైతన్య సినిమాలకు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదవ్వడం ఈ సినిమాతోనే జరిగింది.
బుధవారం రోజున ఈ చిత్రం రూ.13 లక్షల షేర్ తో సరిపెట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి. ఈ శుక్రవారం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ అవుతుంది కాబట్టి ‘థాంక్యూ’ కి కష్టమే..!
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!