Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఇంటి కెప్టెన్ ఎవరు తెలుసా..?
March 4, 2022 / 05:50 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో వారియర్స్ అయిన సీనియర్స్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఇందులో వివిధ టాస్క్ లలో పాల్గొన్ని సీనియర్స్ ఆరుగురు ఇంటి కెప్టెన్ గా పోటీలో పాల్గొన్నారు. ఇందులో నటరాజ్ మాస్టర్, అఖిల్, మహేష్ విట్టా, సరయు, అరియానా ఇంకా తేజస్వినిలు పాల్గొన్నారు. ఇక్కడే హౌస్ మేట్స్ ఒక టాస్క్ ఆడారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న బాక్స్ లని సెలక్ట్ చేస్కుని, పూల్ లో ఉన్న తాళం చేతులని తీసి వాటికి సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసి బాక్స్ లో ఉన్న కెప్టెన్సీ పోచ్ ని బయటకి తీయాల్సి ఉంటుంది.
ఈ టాస్క్ లో ఎవరి స్ట్రాటజీలు వాళ్లు ముందుగానే వేసుకున్నారు. అఖిల్ అయితే, తనకి దొరికిన తాళాలన్నింటిని గుప్పెట్లో పెట్టుకుని మరీ బాక్స్ తీసేందుకు ట్రై చేశాడు. చాలా తాళాలని అఖిల్ ట్రై చేస్తునే ఉన్నాడు. ఎన్నో తాళం చేతులని మొండిగా హోల్డ్ చేస్కుని వేరే వాళ్లకి అవి దొరక్కుండా చేశాడు. అయితే, మరోవైపు తేజస్విని మడివాడా పట్టువదలకుండా ప్రయత్నిస్తునే ఉంది. ఫస్ట్ తాళం చాలా ఈజీగా ఓపెన్ చేసినా సెకండ్ తాళం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది.
ఈ టాస్క్ కి సంచాలక్ గా మిత్రాశర్మ చూస్తూ ఉండిపోయింది. అక్కడ ఎవరికీ ఏమీ కమాండ్ చెప్పలేదు.ఈ టాస్క్ లో ఫస్ట్ అందరికంటే ముందుగా తేజస్వి తాళం చేతులని తీసి ఇంటి మొదటి కెప్టెన్ గా ఎంపిక అయ్యింది. అఖిల్, మిగతా వాళ్లు తాళం చేతులని ప్రయత్నిస్తుండటం తేజస్వికి ప్లస్ అయ్యింది. ఇదే విషయాన్ని టాస్క్ గెలిచిన తర్వాత బిందుమాధవి షేర్ చేస్కుంది. ఇక్కడ బిందు మాధవి గేమ్ ని చాలా బాగా ఎనలైజ్ చేసింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో తేజస్వి ఇంటి కెప్టెన్ గా ఎంపిక అయ్యింది. ఎవరికి ఏ డ్యూటీస్ ఇస్తుంది. ఎవరితో ఎలా ప్రవర్తిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం.