Sreeleela: భగవంత్ కేసరి సినిమా మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

  • October 20, 2023 / 08:00 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో నటి శ్రీ లీల నటించారు అలాగే హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య కూతురు విజ్జి పాప పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో శ్రీ లీల కూతురు పాత్రలో ఎంతో ఒదిగిపోయినటించారు.

ఈ సినిమాలో ఈ పాత్ర చూసిన తర్వాత ఇందులో శ్రీ లీల తప్ప ఇంత అద్భుతంగా ఎవరూ నటించలేరేమో అన్న విధంగా శ్రీ లీల ఈ పాత్రలో ఒదిగిపోయారు. అయితే తాజాగా ఈ విజ్జి పాప పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాత్రలో నటించడానికి శ్రీలీల మొదటి ఆప్షన్ కాదని తెలుస్తుంది. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి ముందుగా వేరే హీరోయిన్ ను సంప్రదించారట.

ఈ సినిమా కథ పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి ముందుగా ఈ సినిమా కథ ద్వారా నటి కృతి శెట్టి వద్దకు వెళ్లారట అయితే ఈ కథ విన్నటువంటి ఆమె కూతురు పాత్రనా అంటూ సాగదీయడంతో ఈ పాత్ర తనకు నచ్చలేదని అనిల్ అనంతరం శ్రీ లీలను సంప్రదించడంతో ఈ సినిమాకు కమిట్ అయ్యారు.ఈ విధంగా కృతి శెట్టి ఈ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె కెరియర్ ప్రస్తుతం కాస్త ఇబ్బందులలోనే ఉందని చెప్పాలి మొదటి మూడు సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కృతి ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో సతమతం అవుతుంది. ఇలాంటి సమయంలో తనకు ఒక మంచి క్యారెక్టర్ దొరికితే బాగుంటుందని ఈమె కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా కూతురు పాత్రలో నటించే అవకాశం వస్తే తన కెరియర్ మరింత ఇబ్బందులలో పడుతుందని భావించినటువంటి ఈమె ఈ సినిమాకి నో చెప్పారట.

కానీ శ్రీ లీల మాత్రం కూతురు పాత్రలో నటించే అవకాశం తనకు మరీ వస్తుందో రాదు అని భావించి ఈ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా సూపర్ హిట్ సినిమాని కృతి శెట్టి మిస్ చేసుకోగా శ్రీ లీల (Sreeleela) అద్భుతంగా ఉపయోగించుకుందని చెప్పాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus