Aadikeshava: ‘ఆదికేశవ’ సినిమాకి కి అదో ప్లస్ పాయింట్..!
November 20, 2023 / 07:55 PM IST
|Follow Us
‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ అందరికీ సుపరిచితమే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కి చిన బ్యానర్ గా… ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ని స్థాపించి.. వరుస సినిమాలు నిర్మిస్తూ అతి తక్కువ టైంలోనే టాప్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ‘ప్రేమమ్’ ‘జెర్సీ’ ‘భీష్మ’ ‘డిజె టిల్లు’ ‘భీమ్లా నాయక్’ ‘సార్’ ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలని ప్రేక్షకులకి అందించారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ అధినేత రాధా కృష్ణ.. ఈయన పెదనాన్న.
ఆయన నిర్మించే సినిమాలకి సంబంధించిన పనులు కూడా చక్కబెట్టేది నాగ వంశీనే..! ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఎక్కువ అప్డేట్స్ ఇస్తుంది కూడా నాగ వంశీనే అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నాగ వంశీ చాలా స్మార్ట్ గా ఉంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. అది కరెక్ట్ గానే ఉంటుంది అని అంతా నమ్ముతారు. ఈయన మాట్లాడే విధానం కూడా చాలా జెన్యూన్ గా ఉంటుంది. ‘లియో’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు నాగవంశీ.
సినిమాకి మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినా బయ్యర్స్ అంతా సేఫ్ అయ్యారు. ప్రాఫిట్స్ కూడా అందుకున్నారు. ‘కంటెంట్ ఎలా ఉన్నా కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ వల్ల రిలీజ్ చేసినట్లు’ డైరెక్ట్ గానే చెప్పారు నాగవంశీ. మరోపక్క వరల్డ్ కప్ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని తన ‘ఆది కేశవ’ చిత్రాన్ని నవంబర్ 24 కి పోస్ట్ పోన్ చేసినట్టు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇండియా మ్యాచ్ లు ఉన్నప్పుడు కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని ముందే గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు నాగవంశీ చెప్పారు.
ఆయన చెప్పింది నిజమే అని.. గత శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలని బట్టి చెప్పొచ్చు. ఇందులో ఒక్క ‘మంగళవారం’ కి తప్ప.. మిగిలిన వాటికి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. కొన్ని సినిమాలకి అయితే మల్టీప్లెక్సుల్లో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అందుకే నెటిజన్లు కూడా ‘ఆదికేశవ’ రిలీజ్ విషయంలో నాగ వంశీని మెచ్చుకుంటున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో (Aadikeshava) ‘ఆది కేశవ’ ప్రేక్షకులకి ఫస్ట్ ఆప్షన్ గా ఉండటం.. ఓ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.