Allu Arjun: ఒక్క కారణంతో బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న అల్లు అర్జున్?

  • June 9, 2023 / 08:37 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బన్నీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోలు కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలను వదులుకొని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.

ఇతర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండడం వలన లేదా కొన్ని సన్నివేశాలు నచ్చకపోవడం వలన లేదంటే సినిమాలో పదేపదే ఒకే సీన్లలో నటించడం వంటి కారణాలవల్ల చాలామంది కొన్ని సినిమాలను మిస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సినిమాలో తర్వాత హిట్ అయినప్పుడు కాస్త బాధపడుతూ ఉంటారని చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఇలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా కథ నచ్చి సినిమా చేయాలన్న కుతూహలం ఏర్పడినప్పటికీ ఈ సినిమాలో పదేపదే లిప్ లాక్ సన్నివేశాలలో నటించాల్సి రావడం వల్ల ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది. ఇక ఇందులో లిప్ లాక్ సన్నివేశాలలో కచ్చితంగా నటించాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో బన్నీ ఈ సినిమాని వదులుకున్నారట. ఇలా తరచూ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం వల్ల తన ఇమేజ్ కి డామేజ్ అవుతుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరి అల్లు అర్జున్ (Allu Arjun) ఈ ఒక్క కారణంతోనే మిస్ చేసుకున్నటువంటి ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేది కాదు విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం అర్జున్ రెడ్డి.ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా అల్లు అర్జున్ కు వచ్చినప్పటికీ ఇందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉన్న కారణంతో ఈ సినిమాని వదులుకున్నారట. ఇక బన్ని రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టులో నటించారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus