నాగ చైతన్య సినిమాలో హైలెట్ గా నిలవనున్న అంశం!

  • December 15, 2017 / 02:08 PM IST

యువ సామ్రాట్ నాగచైతన్య తనకి ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన  చందు మొండేటి దర్శకత్వంలో  సవ్యసాచి సినిమా చేస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మాధవన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు చాకోలెట్ బాయ్, లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న మాధవన్..సవ్యసాచిలో బ్యాడ్ బాయ్ గా కనిపించనున్నారు. నాగ చైతన్య రోల్ కంటే మాధవన్ క్యారెక్టర్ చాలా బలంగా డిజైన్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఇంటెలిజెంట్ గా సాగుతుందంట.

అంతేకాదు.. ఫైట్స్ కూడా కొత్తగా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. ఇలా వీరి మధ్య సాగే పోరాటమే ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని తెలిపింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న  సవ్యసాచి చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా  తెలుగు తెరకు పరిచయం అవుతోంది. కార్తికేయతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసిన చందు.. ఈ చిత్రం ద్వారా మరింత థ్రిల్ అందిస్తారని సమాచారం. ఈ సినిమా తరవాత నాగచైతన్య మారుతి డైరెక్షన్ లో “శైలజారెడ్డి అల్లుడు” అనే  సినిమా చేయనున్నారు.  దీని తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus