Trivikram, Rajamouli: త్రివిక్రమ్, రాజమౌళి ల మధ్య తేడాలు మీకు తెలుసా?
August 9, 2022 / 08:50 PM IST
|Follow Us
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం. కానీ సినీ అభిమానుల్లో కొంతమంది జక్కన్న గ్రేట్ అని అంటుంటే.. మరికొందరు మాటల మాంత్రికుడే గొప్ప అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య సినిమా మేకింగ్ విషయంలో ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
1. బడ్జెట్:
ఎస్.ఎస్. రాజమోళి ఇండస్ట్రీ హిట్ సినిమా తీయాలంటే వందల కోట్ల భారీ బడ్జెట్ కావాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తక్కువ ఖర్చుతో తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ హిట్ సినిమాలు అందించారు.
2. పబ్లిసిటీ:
జక్కన్న ప్రతి సినిమాకు మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేయిస్తారు. మాటల మాంత్రికుడు సాధారణ ప్రచారం మాత్రమే చేస్తారు.
3. గ్రాఫిక్స్:
రాజమోళి గ్రాఫిక్స్, టెక్నీక్స్ పైనే ఆధార పడుతారు. త్రివిక్రమ్ కి తన పెన్నే బలం. చక్కని కథ, పదునైన మాటలతో మెస్మరైజ్ చేస్తారు.
4. కాలం:
రాజమోళి సినిమాను పూర్తి చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. నిర్ణీత కాలంలోనే త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేస్తారు
5. హీరోయిజం:
రాజమౌళి తీసిన కొన్నిసినిమాల్లో హీరోయిజం కనిపించదు. త్రివిక్రమ్ హీరోయిజంకు విలువ ఇస్తారు.
అభిమానులకు తేడాలు కనిపించవచ్చు కానీ… త్రివిక్రమ్, రాజమౌళిలు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన రత్నాల్లాంటి వారు. ఒకరు తక్కువ .. మరొకరు ఎక్కువని కాదు. ఇద్దరూ టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటుతున్నవారే. వారు నడిచే దారులే వేరు.. గమ్యం ఒకటే.. మంచి చిత్రాలు తీయాలి. అందులో త్రివిక్రమ్, రాజమౌళిలు విజయం సాధించారు. మాటల మాంత్రికుడు కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలను సున్నితంగా చూపిస్తుంటే.. జక్కన్న మన జానపద కథలకు గ్రాండ్ లుక్ తీసుకొస్తున్నారు. వీరిద్దరు మా వాళ్లు అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు.