RRR, Acharya: చిరంజీవి – రాజమౌళి మధ్య డీల్ జరిగిందా?
January 21, 2022 / 03:05 PM IST
|Follow Us
సినిమాల విడుదలకు డీల్స్ జరుగుతాయా? ఎందుకు జరగవు మొన్న సంక్రాంతికి సినిమాలు అన్నీ అలా విడుదల చేద్దామనుకున్నారు కదా మరచిపోయారా. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వస్తున్నాయని మిగిలిన సినిమాలను పక్కకు జరిపారు. అయితే ఆ డీల్ సక్సెస్ కాలేదు అనుకోండి. అనుకున్నట్లు ఆ సినిమాలు విడుదల కాలేదు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మరో డీల్ కూడా జరిగిందట. కానీ అది కూడా నిలవలేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈసారి డీల్ పార్టనర్స్ రాజమౌళి, చిరంజీవినట.
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో ‘ఆచార్య’ షూటింగ్ జరిగింది. ఈ రెండింటికీ కామన్ రామ్చరణ్. ‘ఆచార్య’లో మంచి పాత్ర రావడం, తండ్రితో కలసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కడంతో రామ్చరణ్ ఆ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. దీంతో రాజమౌళితో మాట్లాడి, ఒప్పించి ‘ఆచార్య’లో నటించాడంటారు రామ్చరణ్. రాజమౌళి సినిమా చేసేటప్పుడు వేరే సినిమాలు చేయకూడదు అనేది ఓ అనధికారిక రూల్. అయితే ఈ క్రమంలో ఓ డీల్ జరిగిందిట. ‘ఆర్ఆర్ఆర్’కు ముందు ‘ఆచార్య’ రిలీజ్ కాకుండా చూడాలని ఆ డీల్ సారాంశమట.
ఎంతో మంది వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు ముందు ‘ఆచార్య’ వస్తే అందులో చరణ్ లుక్ బయటకు వచ్చేస్తుంది, ఆ క్యూరియాసిటీ ఉండదని రాజమౌళి అన్నారని టాక్. దీంతోనే ముందు ‘ఆర్ఆర్ఆర్’, ఆ తర్వాతనే ‘ఆచార్య’ అనే డీల్ కుదుర్చుకున్నాక ‘ఆచార్య’ను తొలుత ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గతంలో ఫిబ్రవరి 4 తేదీ నిర్ణయించారు. అయితే పరిస్థితులు మారిపోయి అప్పుడు అనుకున్నట్టుగా సినిమాలు రాలేదు. దీంతో ఆ డీల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటున్నారు.
ఈ కారణంగానే ఏప్రిల్ 1న ‘ఆచార్య’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారట. అంటే అంతకంటే ముందే ‘ఆర్ఆర్ఆర్’ రావాలనే ఆలోచన లేదని తెలుస్తోంది.ప్రస్తుతం వస్తున్న సమాచారం అయితే ఏప్రిల్ 29న ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేయాలని చూస్తున్నట్లు భోగట్టా. మరి రాజమౌళి అండ్ కో. ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అన్నట్లు ఆ రోజుకు దగ్గర్లోనే ‘ఎఫ్ 3’ రిలీజ్ ఉంది. అదేం చేస్తారో మరి.