తెలుగు చిత్రపరిశ్రమలో విప్లవానికి నాంది పలుకుతున్న “మను”
March 20, 2017 / 09:37 AM IST
|Follow Us
కొన్ని ఆలోచనలు మొదట తిరస్కరించబడుతాయి.. కొంతకాలం వ్యతిరేకించబడుతాయి.. చివరికి ఆమోదించబడుతాయి. అటువంటి ఆలోచనల్లో “స్వతంత్ర చిత్రం” ఒకటి. వందమంది కలిసి ఒక సినిమాని నిర్మించడం .. అనే ఐడియా తప్పకుండా నవ్వును తెప్పిస్తుంది. తీస్తున్నారని చెప్పినా నమ్మకం కుదరదు. ఇప్పుడు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే 111 మంది కలిసి మను అనే చిత్రాన్ని నిర్మించారు. ఒకే ఒక్కడు ఫణీంద్ర నర్సెట్టి ఆలోచన తెరమీద ఆవిష్కరించడానికి వీరందరూ అండగా నిలిచారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్లు యూట్యూబ్లో మౌనంగా సినీ అభిమానుల గుండెల్లోకి చేరుకుంటోంది.
మను టీజర్ చూసిన వారు, చిత్ర బృందం పడిన కష్టాన్ని తెలుసుకున్న సినీ పెద్దలు ఈ ప్రయత్నాన్ని తెలుగు చిత్రపరిశ్రమలో గొప్పమార్పుకు తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఓ విప్లవానికి నాంది పలుకుతున్న మను మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నారు. గౌతమ్ హీరోగా రూపొందిన ఈ మిస్టరీ రొమాన్స్ డ్రామా మూవీ హిస్టరీ క్రియేట్ చేయడానికి త్వరలో థియేటర్లోకి రానుంది. టీజర్ లో ఆసక్తి రేపుతున్న “క్షణికం నుండి శాశ్వతం లోకి …” అనే వాఖ్యం మాదిరిగా ఒక క్షణంలో వచ్చిన క్రౌడ్ ఫండింగ్ అనే ఆలోచన.. శాశ్వతం కావడానికి మరెంతో దూరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.