‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను ‘పేక మేడలు’తో హీరోగా అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీద విడుదల చేయగా టీజర్ కు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బూమ్ బూమ్ లచ్చన్న విడుదలైంది.
లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ మనో గారు పాడగా లిరిక్స్ రాసింది భార్గవ్ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలైలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.
టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR