Inaya Sultana: కెప్టెన్సీ గేమ్ లో ట్విస్ట్ ఇచ్చింది..! జాక్ పాట్ కొట్టింది.! అసలేం జరిగిందంటే.?
November 26, 2022 / 11:15 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో ఇనయా సుల్తానా మరోసారి ట్విస్ట్ ఇచ్చింది. తనని అందరూ అన్ ప్రిడిక్టబుల్ అని ఎందుకుని అంటారో మరోసారి రుజువు చేసింది. బిగ్ బాస్ ఈవారం చివరి కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చాడు. అంతేకాదు, ఈసారి ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా సెమీ ఫైనల్ కి వెళ్తారని క్లియర్ గా చెప్పాడు. దీంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. గేమ్ పైన ఫోకస్ పెట్టారు. ఒక రింగ్ లో బాల్ ని ఉంచి ఆ బాల్ ని పట్టుకుని బజర్ వచ్చేవరకూ కాపాడుకోవాలి.
బజర్ సౌండ్ వచ్చినపుడు చివరిసారిగా బాల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లు ఒకరిని పోటీ నుంచీ తప్పించాల్సి ఉంటుంది. మొదటగా పోటీ నుంచీ తొలగింపబడిన వాళ్లు సంచాలకులుగా మారతారు. దీంతో ఆట మొదలైంది. మొదటిసారిగా బాల్ ని దక్కించుకున్న రేవంత్ ఫైమాని ఎలిమినేట్ చేశాడు. తన దగ్గర ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందని, మరోసారి అక్కర్లేదనే రీజన్ చెప్పాడు. ఇంతకంటే తన దగ్గర ఎలాంటి రీజన్స్ లేవని అన్నాడు. దీంతో ఫైమా సంచాలక్ అయ్యింది. ఆ తర్వాత బాల్ ని పట్టుకున్న రోహిత్ రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తొలగించేశాడు.
తర్వాత ఆదిరెడ్డి రాజ్ ని, ఆదిరెడ్డి శ్రీహాన్ ని ఎలిమినేట్ చేసేశారు. ఇక్కడే బాల్ పట్టుకున్న ఇనయా ట్విస్ట్ ఇచ్చింది. తను ఇంతవరకూ కెప్టెన్ అవ్వలేదని, అలాగే రోహిత్ కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తను నాకు అడ్డువచ్చే అవకాశం ఉందని రోహిత్ ని ఎలిమినేట్ చేసింది. దీంతో హౌస్ అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. రోహిత్ కళ్లనీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. నిజానికి ఇనయా ఇలా ఎందుకు చేసిందంటే, ఒక్కొక్కరు బాల్ పట్టుకుంటూ ఒకరిని ఆట నుంచీ బయటకి పంపించేస్తున్నారు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వని వాళ్లలో ఇనయాతో పాటుగా రోహిత్ కూడా ఒకడు.
ఒకవేళ వేరేవాళ్లకి బాల్ దొరికితే ఈరీజన్ తో ఇనయాని ఎలిమినేట్ చేసే ప్రమాదం ఉంది. రోహిత్ ని ఆటలో లాస్ట్ వరకూ ఉండనిస్తే, ఖచ్చితంగా బాల్ ని ఎదుటివాళ్లకి ఇవ్వనివ్వడు. కాబట్టి, రోహిత్ ని ఎలిమినేట్ చేసి తన తెలివిని మరోసారి చూపించింది. ఆ తర్వాత శ్రీసత్య బాల్ ని దక్కించుకుని ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తే, మరోసారి ఇనయా కీర్తిని ఎలిమినేట్ చేసి శ్రీసత్యతో ఫైనల్ రౌండ్ ఆడింది. ఫైనల్ గా బాల్ ని తన దగ్గర హోల్ట్ చేసి ఇనయా చివరి ఇంటి కెప్టెన్ అయ్యింది.
దీంతో మరో వారం ఇమ్యూనిటీ కూడా వచ్చింది. దీంతో జాక్ పాట్ కొట్టినట్లుగా అయ్యింది. నేరుగా సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టి ఇనయా. అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం ఇనయాకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. దీంతో ఇనయాని బిగ్ బాస్ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు రెండు వారాలు నామినేషన్స్ లోకి రాకపోవడం అనేది ఇనయాకి మైనస్ అవుతుందా లేదా ప్లస్ అవుతుందా అనేది చూడాలి. అదీ మేటర్.