బిగ్ బాస్ రియాలిటీ షో చివరి దశకి వచ్చేసింది. ఆఖరి వారంలో హౌస్ మేట్స్ కి జెర్నీలని చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో మొదటిగా శ్రీరామ్, తర్వాత మానస్ జెర్నీలని చూపించిన బిగ్ బాస్ ఆ తర్వాత షణ్ముక్ జెర్నీని చూపించాడు. ఫస్ట్ నుంచీ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా సాగిన షణ్ముక్ జెర్నీలో జెస్సీ ఇంకా సిరి ఇద్దరితో ఫ్రెండ్షిప్ అనేది హైలెట్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ పై కామెంట్స్ , తనలో తాను గేమ్ ని ఎనలైజ్ చేస్కోవడం, మోజ్ రూమ్ లో బాతాఖానీ హైలెట్ చేశారు. ఇక నాగార్జున మిర్చి తినిపించిన దగ్గర్నుంచీ గేమ్ లో గేర్ మార్చాడు షణ్ముక్.
ఒకేసారి తనని ఎనిమిదిమంది నామినేట్ చేయడంతో ఆటలో కసి పెంచాడు. జెస్సీ, సిరిలని కలుపుకుని గేమ్ ని ముందుకు తీసుకుని వెళ్లాడు. అక్కడ్నుంచే డిఫరెంట్ షణ్ముక్ ని చూపించాడు. ఇక గేమ్ ముందుకు వెళ్లేకొద్ది బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇల్లు గుర్తుకురావడం, దీపుని మిస్ అవ్వడం జెర్నీలో హైలెట్ చేశారు. ఆ తర్వాత సిరితో ఎమోషనల్ జెర్నీని చూపించారు. బయట ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం, కానీ ఎందుకో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నామ్ అనేది హైలెట్ అయ్యింది. ఆ తర్వాత నాగార్జునతో పంచ్ లు, తోటి హౌస్ మేట్స్ తన గురించి చేసిన కామెంట్స్ ని హైలెట్ చేశారు.
చివరకి వరకూ ఎమోషనల్ గానే సాగిన షణ్ముక్ జెర్నీలో సన్నీ తో గొడవ పడిన అప్పడం లొల్లి హైలెట్ గా నిలిచింది. ఇక తర్వాత సన్నీ జెర్నీని చూపించాడు బిగ్ బాస్. చాలాసేపు సన్నీ జెర్నీ చూస్తూ కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు. ఫస్ట్ నుంచీ పంచ్ లు , జోకులు, సన్నీ చేసిన చేష్టలు ఇవన్నీ చాలా ఫన్నీగా కట్ చేశాడు బిగ్ బాస్. హౌటల్ టాస్క్ లో అనీమాస్టర్ తో చేసిన ఫన్ హైలెట్ అయ్యింది. ఆ తర్వాత సీరియస్ గా గేమ్ ఆడటం, డేరా టాస్క్ లో హంటర్ గా మారడం, నాగార్జన వార్నింగ్ ఇవ్వడం, జైల్ కి వెళ్లడం ఇవన్నీ హైలెట్ చేశారు.
ఇక గిల్టీ బోర్డ్ వేసుకుని తిరగడం అనేది సన్నీ గేమ్ ని టర్న్ చేసింది. అక్కడ్నుంచే సన్నీ గేమ్ లో మార్పుని చూపించారు. తర్వాత టాస్క్ లలో ప్రియాగారు రెచ్చగొట్టడం, సిరితో జరిగిన ఆర్గ్యూమెంట్స్ , మానస్ తో కాజల్ తో ఫ్రెండ్షిప్, ఎవిక్షన్ పాస్ ఇవన్నీ కూడా జెర్నీలో హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత సన్నీ మదర్ కళావతిగారు రావడం, శ్రీరామ్ ని మోసుకుంటూ తిరగడం అనేది జెర్నీలో భాగంగా చూపించారు. సన్నీ గేమ్ మొత్తం కూడా ఒక్కసారిగా కళ్లముందు తనకి కదలాడింది. అది చూస్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు సన్నీ. అదీ మేటర్.