The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ ఆ వెబ్ సిరీస్ కు కాపీనా..!
May 10, 2023 / 10:25 AM IST
|Follow Us
ఈ మధ్యనే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది ‘ది కేరళ స్టోరీ’ చిత్రం. మే 07 న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తుంది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ బాలీవుడ్ చిత్రం 4 రోజులకే రూ.40 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. సినిమాకి పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు.
ఈ సినిమా విడుదల కాకూడదు అంటూ వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. సౌత్ లో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలయ్యే థియేటర్ల దగ్గర భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కొన్ని థియేటర్లకు ఆన్లైన్ బుకింగ్స్ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ ప్రతికూల పరిస్థితులు అన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.
క్రమంగా కలెక్షన్లు, థియేటర్లు పెరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ కొన్ని కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ‘ది కేరళ స్టోరీ’ కాపీ సినిమా అంటూ కొంతమంది అంటున్నారు. 2020లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన “కాలిఫెట్ అనే స్వీడిష్” అనే వెబ్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్లు కొందరు భావిస్తున్నారు. ఆ సిరీస్ లో కూడా నలుగురు యువతులు బ్రెయిన్ వాష్ కు గురవ్వడం..
ఆ తర్వాత జరిగే పరిణాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. (The Kerala Story) ‘కేరళ స్టోరీ’ కూడా అంతే. కాకపోతే అక్కడ ‘యూరప్’ అయితే ఇక్కడ ‘సిరియా’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే నెటిజన్లు ఎంత నెగిటివ్ గా సినిమా పై కామెంట్లు చేసినా… బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం గట్టెక్కేసింది. ఇంకా ఇంకా జనాలు ఎగబడి చూడటానికి రెడీ అవుతున్నారు. ఇది నిజమైన పాన్ ఇండియా సినిమా అంటూ రాంగోపాల్ వర్మ వంటి వారు కూడా కామెంట్లు పెడుతున్నారు.