The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ తో పాటు బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్న మరో సినిమా
May 16, 2023 / 08:27 PM IST
|Follow Us
చిన్న సినిమాలకు జనాలు రారు అన్నది పాత మాట. ఇప్పుడు ప్రమోషనల్ కంటెంట్ తో జనాలను ఇంప్రెస్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే.. ఆ సినిమాలో నటించిన నటీనటులు ఎవరు, ఆ సినిమా బడ్జెట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? అది ఏ భాషలో తీసిన సినిమా? వంటి విషయాలు జనాలు పట్టించుకోవడం లేదు. సల్మాన్ ఖాన్ సినిమాని రూ.200 కోట్ల బడ్జెట్ తో తీసినా జనాలు పట్టించుకోలేదు. బాలీవుడ్లో ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది ఆ సినిమా.
కానీ ‘ది కేరళ స్టోరీ'(హిందీ మూవీ) అనే సినిమా రూ.10 కోట్ల బడ్జెట్ లో తీసినా రూ.150 కోట్ల వరకు కలెక్ట్ చేసి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఇంకా ఈ మూవీ కలెక్ట్ చేస్తూనే ఉంది. ఈ మూవీలానే మరో చిన్న మూవీ ఇప్పుడు రూ.100 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. ఆ సినిమా మరేదో కాదు ‘2018’ మూవీ. ఇది ఓ మలయాళ మూవీ. జూడ్ ఆంథోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 5న రిలీజ్ అయ్యింది. మొదట ఈ మూవీని జనాలు పట్టించుకోలేదు.
కానీ పాజిటివ్ టాక్ వల్ల రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతూనే వచ్చాయి.10 రోజుల్లోనే ఈ మూవీ రూ.100 గ్రాస్ ను కలెక్ట్ చేసింది. టోవినో థామస్, కుంచాకో బోబన్,ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2018 వ సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమా బడ్జెట్ పారితోషికాలు కాకుండా కేవలం రూ.8 కోట్లు.
అయినా ఇది లో బడ్జెట్ మూవీలా (The Kerala Story) అనిపించదు. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించే అవకాశం లేకపోలేదు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే ఈ చిన్న సినిమా తక్కువ టైంలో రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు.