The Legend Review: ది లెజెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
July 29, 2022 / 06:57 PM IST
|Follow Us
తమిళనాట తనదైన శైలి బిజినెస్ & పాపులర్ హీరోయిన్స్ తో యాడ్స్ పుణ్యమా అని అక్కడ విపరీతమైన పేరు సంపాదించుకున్న శరవణన్ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ స్వీయ నిర్మాణ సారధ్యంలో నటించిన చిత్రం “ది లెజెండ్”. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రొటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించడం ఆశ్చర్యకరమైన అంశం కాగా.. ఈ చిత్ర నిర్మాత, కథానాయకుడు అయిన శరవణన్ వయసు నేటికి 51 ఏళ్ళు కావడం విశేషం. మరి ఈ లేటు వయసులో చేసిన డెబ్యూకి ఆడియన్స్ రియాక్షన్ ఏమిటో చదవండి..!!
కథ: ప్రపంచాన్ని కుదిపేసే ఓ వ్యాధికి మెడిసిన్ కనిపెడతాడు డాక్టర్ శరవణన్ (అరుళ్ శరవణన్). ఆ మెడిసిన్ ను అందరికీ ఉచితంగా అందజేయాలనేది శరవణన్ సంకల్పం, ఆ మెడిసిన్ ద్వారా కోట్లు గడించాలని ఆశ పడతాడు వి.జె (సుమన్). ఆ మెడిసిన్ కోసం జరిగిన రచ్చ రంబోలానే “ది లెజెండ్” కథాంశం.
నటీనటుల పనితీరు: పాపులర్, సీనియర్ & జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ కలిపి దాదాపు 50 మంది ఆర్టిస్టులు ఉన్న ఈ సినిమాలో.. హీరోగా శరవణన్ నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే.. ఈ తరహా లేకి కంటెంట్ & స్పూఫ్ కంటెంట్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ మాత్రం ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తారు. ఇక మిగతా నటుల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు: పాపం కెమెరామెన్ వేల్ రాజ్ & వి.ఎఫ్.ఎక్స్ ఆర్టిస్టుల బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. శరవణన్ ముఖంలో ఎక్స్ ప్రెషన్స్, సినిమాలో విషయం ఎంత వెతికినా కనిపించలేదు. దర్శకుడు మేకింగ్ మీద మాత్రమే నమ్మకం పెట్టుకుని, మిగతాదంతా గాలికొదిలేశారు. పాపం ఒకరిది తప్పు, ఒకరిది ఒప్పు అని చెప్పలేం. సినిమానే పెద్ద మిస్టేక్.
విశ్లేషణ: కొన్ని సినిమాల్లో కామెడీ సహజసిద్ధంగా ఉంటుంది, కొన్ని సినిమాల్లో కామెడీ వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ.. “ది లెజండ్”లో పాపం హీరోయిన్ చచ్చిపోయి హీరో ఏడుస్తున్నా.. జనాలు మాత్రం విరగబడి నవ్వుతుంటారు. అంటే.. సినిమా ఎంత లబ్ధప్రతిష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాటల్లో, ఫైట్స్‌లో శరవణన్ కదలికలు లేని ముఖం చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ మాత్రమే చూడదగిన చిత్రమిది.