దగ్గుబాటి ఫ్యామిలీకీ, డిసెంబర్ నెలకీ ఉన్న లింక్ ఏంటో తెలుసా!
December 5, 2022 / 03:07 PM IST
|Follow Us
సోషల్ మీడియా కారణంగా సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీల గురించిన ఇంట్రెస్టింగ్ వార్తలన్నీ తెలుస్తున్నాయి.. వినోదాన్నిచ్చే విషయాలు కావడంతో ప్రేక్షకులు కూడా అలాంటివాటి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు మూవీస్‌కి, యాక్టర్లకు సంబంధించిన పలు విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం డిసెంబర్ నెలకీ, దగ్గుబాటి కుటుంబానికి ఓ మంచి మెమరీ ఉందనే వార్త వైరల్ అవుతోంది.. మూవీ మొఘల్ డా. డి. రామా నాయుడు సినిమాల మీద ప్యాషన్‌తో ఏపీలోని ప్రకాశం జిల్లా, కారంచేడు నుండి చెన్నపట్నం (చెన్నై) చేరుకున్నారు.
పెద్ద కొడుకు సురేష్ బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్టార్ట్ చేసి.. నటరత్న ఎన్టీఆర్‌తో ‘రాముడు – భీముడు’ (1964) వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు.. అంతకుముందు ‘అనురాగం’ (1963) చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.. తమిళ్, హిందీతో పాటు 9 భాషల్లో, 130కి పైగా సినిమాలు నిర్మించి గిన్నీస్ రికార్డ్ సాధించారు. సురేష్ బాబు అభిరుచిగల నిర్మాతగా.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.
రెండో కొడుకు ‘విక్టరీ’ వెంకటేష్ టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరిగా రాణిస్తున్నారు. అప్పట్లో నిర్మాత తనయుడు హీరోగా మారడం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. నాయుడు గారు రామా నాయుడు స్టూడియోస్ స్థాపించి.. తెలుగు పరిశ్రమకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. ఇండస్ట్రీలోని టాప్ ఫ్యామిలీస్‌లో దగ్గుబాటి కుటుంబం కూడా ఒకటి.. ఇక డిసెంబర్ నెలతో దగ్గుబాటి వారికున్న లింక్ విషయమేంటో చూద్దాం..
వెంకీ, సురేష్ బాబు, రానా, ఆయన భార్య మిహీకా నలుగురూ ఈ నెలలోనే పుట్టారు.. డేట్స్ డీటేల్స్ ఇలా ఉన్నాయి.. వెంకటేష్ (డిసెంబర్ 13), రానా (డిసెంబర్ 14), రానా వైఫ్ మిహీకా బజాజ్ (డిసెంబర్ 19), సురేష్ బాబు (డిసెంబర్ 24).. ఇంకో విశేషం ఏంటంటే.. వెంకీ పుట్టినరోజే పెళ్లి రోజు కూడా.. 1985 డిసెంబర్ 15న ఆయన నీరజను వివాహమాడారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే నెలలో జన్మించడంతో పాటు.. వివాహ వార్షికోత్సవం కూడా రావడంతో డిసెంబర్ దగ్గుబాటి ఫ్యామిలీదేనంటూ న్యూస్ ట్రెండ్ అవుతోంది..