సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు ‘కె.జి.ఎఫ్’ లో అలా భాగం అయ్యారట..!

  • April 28, 2022 / 02:23 PM IST

పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టు ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రం కొన్ని ఏరియాల్లో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ తో సమానంగా కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీ స్టడీ రన్ ను కొనసాగిస్తుంది. ‘హొంబెల్ ఫిలింస్’ బ్యానర్ పై విజయ్‌ కిరగందుర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పోస్టర్స్ పై టాలీవుడ్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ గారి పేరు, ఫోటో పడ్డాయి.

అసలు ఆయనకి ఈ సినిమాకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఈ ప్రాజెక్టులో ఎలా భాగం అయ్యారు అనే ప్రశ్నలు కొంతమందిని వెంటాడుతూనే ఉంటాయి. వివరాల్లోకి వెళితే.. ‘కె.జి.ఎఫ్’ కు కైకాల సత్యనారాయణ గారు సమర్పకులుగా వ్యవహరించారు. ఆయన ద్వారానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పరిచయం అయ్యింది.’కె.జి.ఎఫ్ చాప్టర్ 1′ రిలీజ్ టైంలో ఆ మూవీ గురించి అలాగే హీరో యష్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు కైకాల గారు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్టులో ఆయనతో ఓ పాత్ర కూడా చేయించాలి అని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నాడట. కానీ కైకాల గారు ఈ టైములో అంత బేస్ వాయిస్ లో డైలాగులు చెప్పలేను అన్నారట… అంతేకాదు ‘నువ్వు రాసుకున్న పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి నాతో కాదులే’ అని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. కైకాల సత్యనారాయణ గారు అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. విలన్ గా, సహాయ నటుడిగా, ఎన్టీఆర్ కు డూప్ గా అలాగే నిర్మాతగా కూడా ఆయన పలు సినిమాలకి పనిచేశారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus