ఈ వారం విడుదల అవుతున్న సినిమాలు!

  • December 20, 2017 / 07:35 AM IST

గత మూడు వారాలుగా ప్రతి శుక్రవారం 8 నుంచి 15 సినిమాల దాకా విడుదలై తెలుగు సినిమా అభిమానుల్ని ఆశ్చర్యానికి, సదరు సినిమాలు చూశాక నీరసానికి గురిచేసిన విషయం తెలిసిందే. గంపగుత్తుగా ఒకేసారి విడుదల చేసిన ఆ సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అయితే.. ఈవారం మాత్రం సినిమా అభిమానులకి నిజమైన పండగ లాంటిది. ఎందుకంటే.. హిట్ మెషీన్ నాని నటించిన “ఎం.సి.ఏ – మిడిల్ క్లాస్ అబ్బాయి” రేపు విడుదలవుతుంది. నాని సరసన సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో భూమిక ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నాని, ఈ ఏడాది ఆల్రెడీ అయిదు హిట్స్ కొట్టి ఆరో హిట్ కోసం చూస్తున్న దిల్ రాజుల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న “మిడిల్ క్లాస్ అబ్బాయి” హిట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినట్లే.

అలాగే అఖిల్ రెండో చిత్రం “హలో” శుక్రవారం విడుదలకానుంది. “మనం, 24” తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం, నాగార్జున దగ్గరుండి మరీ భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుండడంతో “హలో” సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా విజయం అఖిల్ కెరీర్ కి కీలకం కానుంది. అలాగే “ఇ ఈ, రంగీలా” అనే రెండు చిన్న సినిమాలు కూడా శుక్రవారం విడుదలవుతున్నాయి.

ఇక బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తన సూపర్ హిట్ సినిమా “టైగర్” సీక్వెల్ “టైగర్ జిందా హై” కూడా శుక్రవారం విడుదలకానుంది. హాలీవుడ్ నుంచి ఈవారం పెద్దగా సినిమాలేమీ లేకపోవడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus