Pushpa Leak: పుష్ప లీక్ చేసిన ఇంటి దొంగ అతనా?

  • August 18, 2021 / 05:44 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుండగా బన్నీ ఫ్యాన్స్, సుకుమార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, సాంగ్స్ వరుసగా లీక్ అవుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా తాజాగా మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం పుష్ప లీక్స్ గురించి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మంచి పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి ప్రొడక్షన్ హౌస్ హెడ్ పై ఉన్న కోపంతో ఈ విధంగా చేశాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లీక్ చేసిన వ్యక్తిని విధుల నుంచి తప్పించడంతో పాటు అతనికి వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

మరోవైపు పుష్ప మూవీ వరుస లీక్స్ బన్నీని కూడా బాధ పెట్టాయని బన్నీ లీక్ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పుష్ప మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ రోల్ లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భారీ హిట్ లేని దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus