‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ అసలు సమస్య ఏంటంటే..!
January 3, 2020 / 07:25 PM IST
|Follow Us
ఏమైనా ఈ సంక్రాంతి పోటీ చాలా రసవత్తరంగా మారింది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో తలబడనున్నాయి. ప్రమోషన్ల దగ్గర్నుండీ ఈ రెండు చిత్ర బృందాలు పోటీ పడుతూనే ఉన్నారు. మొదట రెండు సినిమాలు ఒకే రోజు అంటే జనవరి 12నే విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇలా ప్రకటించిన వెంటనే డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో దడ పుట్టుకుంది. దీంతో నిర్మాతలు రాజీకి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న, అలాగే ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు.
అయితే తాజాగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని జనవరి 10నే విడుదల చేయాలని ‘గీత ఆర్ట్స్’ అండ్ బన్నీ టీం డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. ఇక్కడ 10 వ తేదీనే వస్తే.. మొదటి రోజు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ కూడా బాగా ప్లస్ అవుతుంది. అయితే ‘హారిక అండ్ హాసిని’ వారు మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదట. అల్లు అర్జున్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేడు కాబట్టి ఆయన వచ్చాక చూద్దాం అని అంటున్నారట. మరో వైపు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం యూనిట్ సభ్యులు కూడా జనవరి 10 తేదీని మిస్ చేసుకోకూడదని భావిస్తున్నారట. ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు.. ‘అల వైకుంఠపురములో’ చిత్రం నైజాం రైట్స్ ను తీసుకున్నారు. కానీ రెండు చిత్రాలు ఒకే రోజు అయితే దిల్ రాజు .. ‘అల వైకుంఠపురములో’ నుండీ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. మళ్ళీ ఓ మీటింగ్ పెట్టుకుని రాజీకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.