Kasthuri: మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా నటి కస్తూరి..!
October 6, 2023 / 06:18 PM IST
|Follow Us
అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన కస్తూరి ట్విట్టర్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తనదైన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో బిగ్ బాస్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో నెల రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తమిళ్లో మూడు రోజుల క్రితమే మొదలైంది.
తమిళ్ లో బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించాడు కమల్ హాసన్. ఇక బిగ్ బాస్ షో పై కస్తూరి ట్విట్టర్ లో తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ చూస్తారా అన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘‘లేదు.. నేను అసలు పట్టించుకోను.. ఒక ఇంట్లో చాలామందిని ఉంచి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ చూపించే షో గురించి నేను అసలు పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు..
నాకు అంత టైమ్ లేదు. ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. నాకు ఒక కుటుంబం ఉంది.. దాని బాధ్యతలు ఉన్నాయి.. వర్క్స్ ఉన్నాయి” అంటూ రాసుకొచ్చింది. ఇక కస్తూరి ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.ఒకరేమో మీరు చాలా షోస్ కు వెళ్లారు కదా.. ఇది కూడా ఒక షోనే కదా అని చెప్పుకొచ్చారు. ఇంకొందరు డబ్బుల కోసం ఏ షోస్ కైనా వెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం అదుపుతప్పి మాట్లాడాడు.
“అవునులే నీకు గంటకు రూ.5000 వస్తాయి కదా.. నువ్వేం వెళతావ్” అని అడగ్గా (Kasthuri) కస్తూరి ఆ ట్వీట్ పై ఫైర్ అయింది. “మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది అంటూ విరుచుకుపడింది”. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.