Anushka: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్ కి అనుష్క అందుకే దూరంగా ఉంటుందా?

  • September 2, 2023 / 10:51 AM IST

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేసింది. నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరో. ‘యువీ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మ‌హేష్ బాబు.పి దర్శకుడు. రథన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘లేడి లక్కు లేని లక్కు’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది.

టీజర్ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో (Anushka) అనుష్క చెఫ్ గా నటించగా.. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించాడు. సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా విడుదలకు వారం రోజులు కూడా టైం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నా… ఆ స్థాయిలో అయితే ప్రమోషన్స్ చేయడం లేదు.

మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ అన్నీ హీరో నవీన్ పోలిశెట్టి తన భుజాన వేసుకుని మోస్తున్నాడు. అనుష్క మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్ కి హాజరు కాలేదు. అందుకు కారణం.. అనుష్కకి హెడ్ వెయిట్ పెరగడం అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కానీ అది తప్పు. అనుష్క ఇప్పుడు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంది. నేచురల్ థెరపీలు తీసుకున్నా ఆమె బరువు తగ్గలేకపోతుంది. ఇప్పుడు భారీ కాయంతో అనుష్క మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు అని ఇన్సైడ్ టాక్.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?</

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus