Regina: ఆ ఒక్క కారణం వల్లే రెజీనా స్టార్ హీరోయిన్ కాలేకపోయిందట..!
April 15, 2023 / 07:48 PM IST
|Follow Us
సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైన హీరోయిన్ రెజీనా … ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘రారా కృష్ణయ్య’, అల్లు శిరీష్ తో ‘కొత్త జంట’, సాయి ధరమ్ తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ , రవితేజ తో ‘పవర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.కానీ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అంతేకాకుండా తర్వాత ఈమెకు అవకాశాలు కూడా తగ్గాయి.
కొంత గ్యాప్ తర్వాత ‘ఎవరు’ తో చేసిన ప్రయోగం కూడా వికటించింది. ఇక ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సీరిస్ తో కూడా ఈమె ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఈమె సక్సెస్ కాలేకపోయింది. ‘అ!’ సినిమాలో మంచి పాత్ర పోషించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఆ సినిమాలో కాజల్ హైలెట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. రెజీనా గ్లామర్ షో చేయడానికి, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడానికి కూడా వెనుకాడదు.
అలాంటప్పుడు (Regina) ఈమె స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయింది అనే డౌట్ అందరిలో ఉంటుంది. అందుకు ఈమె ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం నడపడం అని అంతా అంటుంటారు. కానీ విషయం వేరు. ఈమె ఏ భాషల్లోనూ పీఆర్ టీంని మెయింటైన్ చేయదు. హీరో, హీరోయిన్లకు సరైన పీఆర్ఓ టీం ఉండాలి.
లేదంటే వారి వద్దకు మంచి ప్రాజెక్టులు వస్తాయన్న గ్యారెంటీ లేదు. రెజీనా మంచి అందగత్తె, టాలెంట్ ఉన్న అమ్మాయి అయినప్పటికీ ఈ విషయంలో శ్రద్ద పెట్టకపోవడం వల్ల ఈమె వెనుకబడిపోయింది.