Surya Kiran: దర్శకుడు సూర్య కిరణ్ మృతికి కారణాలు అవేనా?
March 12, 2024 / 11:41 AM IST
|Follow Us
ప్రముఖ దర్శకుడు, సీనియర్ హీరోయిన్ కళ్యాణి (Kalyani) మాజీ భర్త అయిన సూర్య కిరణ్ (Surya Kiran) నిన్న చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్లే ఆయన మృతి చెందినట్టు ప్రకటించారు. కామెర్ల వ్యాధితో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,అది విషమించడం వల్లే ప్రాణం కోల్పోయినట్టు ప్రకటించారు.అది మాత్రమే కాదు సూర్య కిరణ్.. ఒంటరి తనం వల్ల కూడా కృంగిపోయి మరణించినట్టు కొంతమంది తెలియజేసారు. కళ్యాణి, సూర్య కిరణ్.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కొన్నాళ్ళు బాగానే కలిసున్నారు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కళ్యాణి ఈ విషయం పై ఎప్పుడూ స్పందించింది లేదు. సూర్య కిరణ్ మాత్రం ‘బిగ్ బాస్ 4 ‘ టైంలో ఈ విషయం పై స్పందించారు. ‘తానూ అయిష్టంగానే కళ్యాణికి విడాకులు ఇచ్చినట్టు తెలియజేశారు. కళ్యాణి తన తల్లి మాటలు విని అతన్ని వదిలేసింది అని సూర్య కిరణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అతను డైరెక్టర్ గా ఫెయిల్ అవ్వడం, నిర్మాత గా కళ్యాణి పేరుతో సినిమా తీసి అప్పుల పాలవ్వడం..
కళ్యాణి కుటుంబ సభ్యులకి నచ్చలేదని, అందుకే విడాకులు తీసుకున్నట్లు అతను తెలియజేశాడు. విడాకులు ఇచ్చాక కూడా ‘డబ్బులు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం.. తొందర పడొద్దు’ అని కళ్యాణితో సూర్య కిరణ్ చెప్పాడట. అయినా కళ్యాణి అతన్ని దూరం పెట్టింది. దీంతో అతను ఒంటరితనం వల్ల కృంగిపోవడం,మద్యానికి బానిసైపోవడం వంటి కారణాల వల్ల… ఆరోగ్యం క్షీణించి అతను మరణించినట్టు తెలుస్తుంది.