Rajamouli: జక్కన్న ఇతర రైటర్ల కథలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణాలివే!
July 19, 2024 / 08:20 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం తడబాటు అవసరం లేకుండా రాజమౌళి (S. S. Rajamouli) పేరు సమాధానంగా చెప్పవచ్చు. జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా అంచనాలకు మించి విజయం సాధించి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. అయితే జక్కన్న బయటి రచయితల కథలతో సినిమాలు తెరకెక్కించడం అరుదుగా మాత్రమే జరిగిందనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 (Student No: 1) సినిమాకు మాత్రం కథ అందించింది బయటి రచయిత కావడం గమనార్హం.
అయితే రాజమౌళి ఇతర రైటర్ల కథలను సైతం ఒక సందర్భంలో విన్నారని అయితే 250 కథలు విన్నా ఒక్క కథ కూడా జక్కన్నకు పూర్తిస్థాయిలో సంతృప్తి కలిగించలేదని సమాచారం అందుతోంది. జక్కన్న ఇతర రైటర్ల కథలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి అసలు కారణాలు ఇవేనని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) చెప్పిన కథలతో చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో రాజమౌళి పని సులువవుతోంది. ఇప్పటివరకు 12 సినిమాలను తెరకెక్కించి 12 సినిమాలతో విజయాలను అందుకున్న జక్కన్న మహేష్ బాబు (Mahesh Babu) సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
ఈ సినిమా రిలీజ్ కోసం మరో మూడేళ్లు ఎదురుచూపులు తప్పవు. రాజమౌళి ఈ సినిమా కోసం గత సినిమాల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారంటే ఈ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే మహేష్ బాబు ఈ సినిమాలో నటిస్తూనే మరో సినిమాలో నటించేలా జక్కన్న అనుమతి ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఒకే సినిమాకు మహేష్ మూడేళ్లు పరిమితం కావడం కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.
మరోవైపు రాజమౌళి టెక్నికల్ గా కూడా మహేష్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. యంగ్ డైరెక్టర్లు సైతం అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తూ రాజమౌళికి గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జక్కన్న మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో జక్కన్న సినిమాలకు మరిన్ని ఆస్కార్ లు రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.