Sai Pallavi: సాయిపల్లవి ఇప్పట్లో తెలుగు సినిమా చేయదా..?

  • February 17, 2023 / 05:38 PM IST

సౌత్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయిపల్లవి ఒకరు. మొదటి నుంచి కూడా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అవకాశాలు రాక ఆమె సినిమాలు చేయడం లేదా..? అంటే అదీ కాదు. చాలా మంది టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. కానీ సాయిపల్లవికి కథలేవీ నచ్చడం లేదట. ఆమె నటించిన చివరి సినిమా ‘విరాటపర్వం’పై చాలానే ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.

కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో కొంతకాలం తెలుగులో గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. దీనికంటే ముందు ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘లవ్ స్టోరీ’ సక్సెస్ లలో సాయిపల్లవి పాత్ర ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించిన ‘గార్గి’ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. కమర్షియల్ గా అది వర్కవుట్ కాలేదు. నటిగా ఎన్ని మంచి సినిమాలు తీస్తున్నా.. మార్కెట్ కోణంలో తన విలువ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడం లేదనే విషయం సాయిపల్లవికి అర్ధమైంది.

అందుకే ఇకపై మలయాళ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఆమె చేతిలో శివ కార్తికేయన్ తో చేస్తోన్న తమిళ సినిమా ఒకటే ఉంది. నివిన్ పౌలీతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోందని సమాచారం. తెలుగు ఆడియన్స్ కి మాత్రం ఇప్పట్లో కనిపించేలా లేదు. ‘పుష్ప2’ సినిమాలో ఒక హీరోయిన్ గా సుకుమార్.. సాయిపల్లవిని సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.

తెలుగులో ఈమెకి మిడ్ రేంజ్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈమె సినిమాలకు హీరోలతో సమానంగా కటౌట్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతటి ఫాలోయింగ్ ఉన్నప్పుడు.. ఎక్కువ గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదేమోనని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus