Anandhi: ఆనంది.. ప్రమోషన్లకి ఎగ్గొట్టింది అందుకేనా?

  • September 1, 2021 / 10:55 AM IST

ఆనంది మన తెలుగమ్మాయే.ఈమె అసలు పేరు రక్షిత అయినప్పటికీ ఆ తర్వాత ఆనంది గా పేరు మార్చుకుంది. తెలంగాణకి చెందిన వరంగల్ లో పుట్టి పెరిగింది. ‘ఈరోజుల్లో’ బస్ స్టాప్’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. రాంచరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ మూవీలో బ్రహ్మానందం.. రఘుబాబు చెల్లెలికి మధ్య పెళ్లి చూపుల ఎపిసోడ్ ఉంటుంది. అక్కడ పెళ్లికూతురిగా కనిపించేది ఆనందినే..! అయితే తమిళంలో ఈమె బాగా క్లిక్ అయ్యింది.

వరుసగా అక్కడ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ‘జాంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈమెను మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చాడు. ఇటీవల వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీలో హీరోయిన్ గా నటించింది ఆనంది. ఈమె పాత్రకి ప్రశంసలు కురిసాయి. అయితే సినిమా ప్రమోషన్లకు ఈమె హాజరు కాలేదు. దీనికి అసలు కారణం ఏంటా అని ఆరా తీయగా. ఈమె తల్లైనట్టు తెలుస్తుంది. అవును 2021 జనవరిలోనే సోక్రేట్స్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అప్పుడే ఈమె తల్లి కూడా అయిపోయింది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ ప్రమోషన్ల కోసం దర్శకనిర్మాతలు ఈమెను సంప్రదించడానికి ప్రయత్నించారట. కానీ ఈమె ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. అయినప్పటికీ దర్శకనిర్మాతలు ఎడతెగకుండా ప్రయత్నించడంతో ఈ విషయం బయటపడినట్టు తెలుస్తుంది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పాటు మరో రెండు సినిమాల్లో నటించింది. తమిళ్ లో ఒక సినిమా.. మలయాళంలో ఒక సినిమా. అవి కూడా రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus