Arjun: ఆ కారణంగా కోడి రామకృష్ణ సినిమాకి అర్జున్ నో చెప్పాడట..!
June 23, 2022 / 07:35 PM IST
|Follow Us
యాక్షన్ కింగ్ అర్జున్ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ దర్శకుడిగా ఓ చిత్రం తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా.. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించబోతున్నారు.ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అర్జున్ సొంత బ్యానర్ ‘శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై ఈ చిత్రం రూపొందనుంది. టాలీవుడ్ లో అర్జున్ కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి బెస్ట్ విశేష్ చేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
అర్జున్ మాట్లాడుతూ.. “1984లో నాకు ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. కానీ నేను చేయనని చెప్పాను. దర్శకుడు కారణం అడిగితే నాకు యాక్టింగ్ తెలీదని చెప్పాను. ‘నేను నేర్పిస్తాను’ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత తెలుగు భాష రాదని చెప్పాను. ‘అదంతా నేను చూసుకుంటాను’ అని చెప్పారు. ఆ సినిమా పేరు ‘మా పల్లెలో గోపాలుడు’. ఆ దర్శకుడు మా గురువుగారు కోడి రామకృష్ణ గారు. నిర్మాత భార్గవ్ ఆర్ట్ ఫిల్మ్స్ గోపాల్ రెడ్డి గారు.ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్.
నా గురువు గారిని తలుచుకుని ఈ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టడం ఆనందం ఉంది. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి, తెలుగు పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్ ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. తను ఒక తమిళ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడు ఈ తెలుగు సినిమా చేయబోతుంది. తను చాలా డెడికేటెడ్ గా పని చేస్తుంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తుందనే నమ్మకం నాలో ఉంది.
ప్యాషన్, హార్డ్ వర్క్, భయం ఉంటేనే ఇక్కడ నిలబడగలరు అని తనకి చెబుతుంటాను. డబ్బులు ఇచ్చి ప్రేక్షకులు సినిమా చేస్తున్నారు అనే భయం ఆర్టిస్ట్ లో ఉంటేనే విజయం సాధిస్తారని చెప్తాను. పరిశ్రమలో నాకు 42 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో ఇండస్ట్రీ నవ్వు, ఏడుపు, నొప్పి, విజయం, అపజయం ఇలా అన్నీ నేర్పించింది. ఇలాంటి అద్భుతమైన పరిశ్రమకి నా కుమార్తెను పరిచయం చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా గర్వంగా వుంది.
విశ్వక్ కూడా వండర్ ఫుల్ హీరో. ఈ కథ విన్నాక పిచ్చిపిచ్చిగా నచ్చింది అని విశ్వక్ చెప్పాడు. దర్శకుడిగా ఇది నాకు 13వ సినిమా. నిర్మాతగా 15వ సినిమా. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఆయన మాటలతో కథ మరో స్థాయికి వెళ్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా లాంచింగ్ కి రావడం, ‘మీరు చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు. మీతో పాటు వుంటాం”అని ఆయన చెప్పడం ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.