దేవుడా.. ఛత్రపతి హిందీలో ఫ్లాప్ కావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయా?
May 15, 2023 / 09:01 AM IST
|Follow Us
భారీ అంచనాలతో వినాయక్ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి సినిమా తెరకెక్కి హిందీలో విడుదలైంది. ఈ సినిమా ఈ సినిమా టైటిల్ కోసం మేకర్స్ 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారని బోగట్టా. దాదాపుగా 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఛత్రపతి మూవీ హిందీలో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిలైంది. ప్రభాస్ నటించిన ఛత్రపతి నచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు.
అయితే ఛత్రపతి హిందీలో ఫ్లాప్ కావడం వెనుక కారణాలేంటనే ప్రశ్నలకు సంబంధించి ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ కు అనుగుణంగా ఛత్రపతి సినిమాను తెరకెక్కించే విషయంలో వినాయక్ ఫెయిల్ అయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పర్ఫామెన్స్ చూసిన ప్రేక్షకులు బెల్లంకొండ శ్రీనివాస్ ఆ స్థాయిలో మెప్పించలేదని కామెంట్లు చేసున్నారు. ఛత్రపతి సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన సన్నివేశాలను కట్ చేసి హిందీ ఛత్రపతిని తెరకెక్కించడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.
హిందీ ఛత్రపతి పాటలు, బీజీఎం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేని విధంగా పాటలు కానీ బీజీఎం కానీ ఉండటం గమనార్హం. తెలుగు ఛత్రపతి సినిమాలో హైలెట్ అయిన సన్నివేశాలు హిందీ ఛత్రపతిలో సాదాసీదాగా ఉన్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ గతంలో పలు రీమేక్ సినిమాలతో హిట్ కొట్టినా ఈసారి మాత్రం తడబడ్డారనే చెప్పాలి.
వి.వి.వినాయక్ కు బాలీవుడ్ లో కొత్త ఆఫర్లు రావడం తేలిక కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వి.వి.వినాయక్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. రాబోయే రోజుల్లో వినాయక్ కు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో బెలంకొండ శ్రీనివాస్ రీమేక్ సినిమాలలో నటించినా తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.