Balakrishna: ఆ సినిమాలలోని స్టార్ హీరోలకు శివాజీ డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా?
April 26, 2023 / 01:59 PM IST
|Follow Us
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. వైవీఎస్ చౌదరి గారు కొంచెం టైమ్ ఇస్తే మంచి సినిమా తీస్తారని ఆయన తెలిపారు. మాస్టర్ సినిమాలో చిరంజీవి గారితో చేయడం అద్భుతం అని శివాజీ అన్నారు. మూడో సినిమాలోనే హీరో అని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదని అయన తెలిపారు. నేను కెరీర్ తొలినాళ్లలో ఏ సినిమా వచ్చినా ఒప్పుకున్నానని శివాజీ పేర్కొన్నారు.
వైవీఎస్ చౌదరి గారి సినిమాలలో నాకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే లెక్కలు మారిపోతాయని ఆడియన్స్ రిసీవ్ చేసుకోరని భావిస్తారని శివాజీ కామెంట్లు చేశారు. 2009 వరకు నేను 95 సినిమాలు చేశానని ఆయన అన్నారు. ఈ సినిమాలలో 60 సినిమాలలో హీరోగా చేశానని శివాజీ తెలిపారు. నేను నటించి రిలీజ్ కాని సినిమాలు దాదాపుగా లేవని ఆయన కామెంట్లు చేశారు.
బూచమ్మ బూచోడు లాస్ట్ మూవీ అని ఆ మూవీ బడ్జెట్ 78 లక్షలు అని శివాజీ పేర్కొన్నారు. నేను నటించిన సీతారాముడు మూవీ ఫస్ట్ వీకెండ్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ఆయన తెలిపారు. నితిన్ కు రెండు సినిమాలకు డబ్బింగ్ చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ కు, ప్రభుదేవాకు డబ్బింగ్ చెప్పానని శివాజీ తెలిపారు. తారకరత్న ఫస్ట్ మూవీకి నేనే డబ్బింగ్ చెప్పానని ఆయన పేర్కొన్నారు. నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలు కూడా సక్సెస్ సాధించాయని శివాజీ కామెంట్లు చేశారు.
నేను బాలయ్యతో (Balakrishna) తప్ప అందరితో సినిమాలు చేశానని ఆయన తెలిపారు. నేను పిచ్చి పాత్రలు చేయలేదని శివాజీ చెప్పుకొచ్చారు. జల్సా మూవీలో చిన్న రోల్ చేశానని శివాజీ కామెంట్లు చేశారు. బాలయ్య సినిమాలో సాయికుమార్ రోల్ మొదట నాకు వచ్చిందని ఆ తర్వాత ఏమైందో తెలియదని ఆ రోల్ మిస్ అయిందని శివాజీ తెలిపారు. సీమ సింహం సినిమా గురించి శివాజీ పరోక్షంగా ప్రస్తావించారు. మొదటినుంచి కూడా బాలయ్య సినిమాల్లో కుదిరేది కాదని శివాజీ పేర్కొన్నారు.