Geetu: గీతూ రాయల్ సైలెన్స్ వెనుక అసలు రీజన్స్ ఇవే!
November 8, 2022 / 11:33 AM IST
|Follow Us
బిగ్ బాస్ ప్రముఖ కంటెస్టెంట్లలో ఒకరైన గీతూ రాయల్ తాజాగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. గలాటా గీతూ ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ షోను చూడబోమని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు బిగ్ బాస్ షో నుంచి బయటకు వఛ్చి బిగ్ బాస్ కేఫ్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత గీతూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం అందుతోంది.
బిగ్ బాస్ స్టేజ్ పై ఏడ్చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్న గీతూ యూట్యూబ్ ఛానెళ్లు సంప్రదించినా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడలేదని సమాచారం అందుతోంది.
కొంత సమయం మాత్రం ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన గీతూ రాయల్ తర్వాత సోషల్ మీడియాలో కనిపించలేదు. బిగ్ బాస్ విజేతగా నిలవాలనే కలలు నిజం కాకపోవడం గీతూ రాయల్ ను ఎంతగానో బాధ పెట్టిందని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్6 విన్నర్ ను ప్రకటించిన తర్వాతే గీతూ రాయల్ మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గీతూ రాయల్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని బిగ్ బాస్ షోలో ఓడిపోయినా లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
గీతూ రాయల్ కు ఊహించని రేంజ్ లో పారితోషికం దక్కుతోంది. గీతూ రాయల్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారానే ఆమె ఎంతోమంది ఫ్యాన్స్ కు చేరువయ్యారు. బిగ్ బాస్ షో గీతూ లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో గురించి గీతూ పాజిటివ్ గానే కామెంట్లు చేయనుందని తెలుస్తోంది. గలాటా గీతూ సాఫ్ట్ గా ఉండి ఉంటే ఆమె మరికొన్ని వారాలు హౌస్ లో కొనసాగేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.