Kalyan Ram: అలా చేయడం వల్లే కళ్యాణ్ రామ్ కు షాకింగ్ ఫలితాలు వస్తున్నాయా?

  • April 11, 2023 / 12:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ కు బ్యాగ్రౌండ్ తో పాటు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో బింబిసార సినిమా ప్రూవ్ చేసింది. అయితే వరుసగా విజయాలు సాధించే విషయంలో కళ్యాణ్ రామ్ తడబడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో చేస్తున్న పొరపాట్లు ఫ్లాప్ రిజల్ట్ కు కారణమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం కెరీర్ పరంగా మైనస్ అవుతోంది.

టాలెంట్ ఉన్న కొంతమంది డైరెక్టర్లు కళ్యాణ్ రామ్ హిట్లు ఇస్తున్నా టాలెంట్ లేని కొంతమంది దర్శకులు మాత్రం షాకిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని సినిమాలు సైతం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు కొంతమేర సహాయం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే ప్రయోగాత్మక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రావాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కూడా మైనస్ అవుతోంది. ఇతర హీరోల స్థాయిలో కళ్యాణ్ రామ్ తన సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. కళ్యాణ్ రామ్ బింబిసార పార్ట్2 లో నటిస్తారని వార్తలు వినిపిస్తున్నా ఆ సినిమాకు సంబంధించి ఎంతో కన్ఫ్యూజన్ నెలకొంది. కళ్యాణ్ రామ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ మరిన్ని సినిమాలలో వేగంగా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేసి మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus